Begin typing your search above and press return to search.

సల్మాన్​తో మైత్రీ థ్రిల్లర్ .. టీజర్​ వచ్చేసింది

అలా కాకుండా సల్మాన్ ఖాన్ ఫిల్మ్​ - మైత్రీ మూవీస్ కలిసి తాజాగా ఓ మూవీని సమర్పించనున్నట్లు తాజాగా ప్రకటించి సినీ ప్రియులకు సడెన్ సర్​ప్రైజ్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 12:23 PM GMT
సల్మాన్​తో మైత్రీ థ్రిల్లర్ .. టీజర్​ వచ్చేసింది
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన ప్రొడక్షన్ హౌస్​ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. భారీ చిత్రాలను నిర్మిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్​కు చెందిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్​తో జత కట్టింది. ఈ రెండు బ్యానర్లు​ కలిసి తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. టీజర్​ కూడా విడుదల చేశారు.

గతంలో సల్మాన్​ను మైత్రీ అధినేతలు కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు మైత్రి బ్యానర్​లో భాయ్ సినిమా చేస్తారని అంతా భావించారు. కానీ అలా కాకుండా సల్మాన్ ఖాన్ ఫిల్మ్​ - మైత్రీ మూవీస్ కలిసి తాజాగా ఓ మూవీని సమర్పించనున్నట్లు తాజాగా ప్రకటించి సినీ ప్రియులకు సడెన్ సర్​ప్రైజ్ చేశారు.

అంథేనా ప్రొడక్షన్ హౌస్​తో కలిసి సమర్పించనున్నట్లు తెలిపారు. ఏ రీల్ లైఫ్ ప్రొడక్షన్​ పీవీటీ ఎల్​టీడీ ఫిల్మ్​ బ్యానర్​పై ఫర్రీ అనే సినిమాను చేస్తున్నట్లు తెలుపుతూ టీజర్​ గ్లింప్స్​ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ పోస్టర్​ను కూడా డిఫరెంట్​గా డిజైన్ చేశారు. వీడియోలో స్టూడెంట్స్​ పజిల్ సాల్వ్​ చేస్తున్నట్లు చూపిస్తూనే దానికి కొన్ని ఇంటెన్సివ్ సీన్స్​ను జోడించి ఊహకందని ఏదో జరుగుతున్నట్లుగా ఆసక్తిగా చూపించారు.

పోస్టర్​లోనూ పజిల్​ను బాగా హైలైట్ చేశారు. టైటిల్ ఇంగ్లీష్​ నేమ్​లో కరెన్సీ సింబల్​ను కూడా హైలైట్ చేస్తూ చూపించారు. సినిమా మొత్తం ఊహకందని మలుపులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​ సాగుతుందని వీడియోలో పేర్కొన్నారు. జంతారా ఫేమ్​ డైరెక్టర్ సౌమేంద్ర పధి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తంగా ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా సాగింది.

ఇకపోతే ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవి శంకర్​, అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, నిఖిల్ నమిత్, సునిర్ ఖేతర్​ పాల్​ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 24 నవంబర్ థియేటర్లలో రానున్నట్లు మేకర్స్ తెలిపారు.