Begin typing your search above and press return to search.

ఫరియా మ్యాక‌ప్ లెస్ మ‌త్తెక్కించేనా?

ఉవ్వెతున దూసుకొచ్చిన యువ కెర‌టం ఫిరియా అబ్దుల్లా సుప‌రిచిత‌మే. అమ్మ‌డు తొలి సినిమా `జాతి ర‌త్నాలు`తో మంచి విజయం అందుకుంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:45 AM GMT
ఫరియా మ్యాక‌ప్ లెస్ మ‌త్తెక్కించేనా?
X

ఉవ్వెతున దూసుకొచ్చిన యువ కెర‌టం ఫిరియా అబ్దుల్లా సుప‌రిచిత‌మే. అమ్మ‌డు తొలి సినిమా `జాతి ర‌త్నాలు`తో మంచి విజయం అందుకుంది. ఆ విజ‌యం అమ్మ‌డికి అవ‌కాశాలు బాగానే తెచ్చి పెట్టింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`..`బంగార్రాజు`...`రావ‌ణ‌సుర` లాంటి చిత్రాల్లో న‌టించింది. అవ‌కాశం వ‌స్తే హీరోయిన్ ..కాకుంటే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానైనా న‌టించింది. కానీ ప‌రాజ‌యాలు అన్నింటిని తారుమారు చేస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది.


ప్ర‌స్తుతం ఫిరియా ఖాతాలో ఎలాంటి సినిమాలు లేవు. కొత్త ఛాన్సుల కోసం సెర్చింగ్ త‌ప్ప క‌మిట్ అయిన సినిమాలేవి లేవు. మ‌రి సొగ‌స‌రి భ‌విష్య‌త్ ని ఎలా ప్లాన్ చేస్తుంది? అన్న‌ది తెలియాలి. ఇక్క‌డ అవ‌కాశాలు రాని భామ‌లంతా సౌత్ లో నే ఇత‌ర భాష‌ల‌కి షిప్ట్ అవుతున్నారు. మ‌రి ఫ‌రియా మ‌దిలో అలాంటి ఆలోచ‌న ఉందా? లేక ప‌డిన చోటే లేస్తుందా? అన్న‌ది చూడాలి. ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌దు.


రేర్ గానే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. అదీ ట్రెడీష‌న‌ల్ ఫోటోల‌తోనే ద‌ర్శ‌నిస్తుంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి తావివ్వ‌దు. వీలైనంత‌వ‌ర‌కూ ట్రెడీష‌నల్ దుస్తుల్లోనే క‌నిపిస్తుంది. సినిమాల్లో పాత్ర‌లు త‌ర‌హాలోనే ఇన్ స్టాలో క‌నిపిస్తుంది. ఆ ర‌కంగా చూస్తే యువ‌తలో పాపులారిటీ త‌క్కువ‌గా నే ఉంది. తాజాగా ఫిరియా మ్యాక‌ప్ లెస్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో అమ్మ‌డు ఎలాంటి మ్యాక‌ప్ వేసుకోకుండా త‌న‌లో స‌హ‌జ బ్యూటీని హైలైట్ చేసింది


క్యాజువ‌ల్స్ లో అమ్మ‌డు ఉద‌యాన్నే పోస్ట్ చేసిన పిక్స్ ఇవి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఫరియా అభిమానులు ఇలాంటివి కాదు..హాట్ హాట్ ఫోటోలు కావాలంటూ పోస్ట్ లు పెడు తున్నారు. మ‌రి ఫ‌రియా ఆ దిశ‌గా ఛేంజ్ ఏమైనా తీసుకొస్తుందా? అన్న‌ది చూడాలి