Begin typing your search above and press return to search.

పాపం 'ఆ ఒక్కటి' కూడా మిస్‌..!

చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్‌ హీరోయిన్‌ పాత్ర దక్కిందని సంతోషించిన ఫరియా కు ఆ ఒక్కటి అడక్కు సినిమా ఫలితం కూడా నిరాశనే మిగిల్చింది.

By:  Tupaki Desk   |   20 May 2024 2:30 PM GMT
పాపం ఆ ఒక్కటి కూడా మిస్‌..!
X

హైదరాబాదీ తెలుగు అమ్మాయి ఫరియా అబ్దుల్లా మోడలింగ్‌ చేస్తూ థియేటర్ ఆర్టిస్టుగా, యూట్యూబర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగడం ద్వారా వచ్చిన గుర్తింపు తో జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్ ను సొంతం చేసుకుంది.

జాతిరత్నాలు సినిమాలో చిట్టీ పాత్రలో నటించడం ద్వారా వచ్చిన గుర్తింపు తోనే ఇంకా కెరీర్ ను ఫరియా కొనసాగిస్తూ ఉంది. ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఈమెకు సరైన గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. హైట్ కాస్త ఎక్కువ ఉండటం కూడా ఈమెకు మైనస్ అనే వారు లేక పోలేదు.

తాజాగా అల్లరి నరేష్‌ తో కలిసి నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఫరియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్‌ హీరోయిన్‌ పాత్ర దక్కిందని సంతోషించిన ఫరియా కు ఆ ఒక్కటి అడక్కు సినిమా ఫలితం కూడా నిరాశనే మిగిల్చింది.

తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌ లో హీరోయిన్స్ గా ఎంట్రీ దక్కించుకోవడమే కష్టం. అలాంటిది వరుసగా అవకాశాలు దక్కించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలకు మాత్రమే మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చాయి.

ఇప్పుడు ఫరియా కి ఆ గౌరవం దక్కింది. కానీ ఆమె కు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తాయా అంటే కచ్చితంగా డౌటే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమా హిట్ అయ్యి ఉంటే మరో రెండు మూడు సినిమా ఆఫర్లు ఫరియా చేతికి వచ్చేవి.. కానీ ఆ సినిమా ఫెయిల్‌ అవ్వడంతో చిటీ మిస్ అయ్యింది.

ప్రస్తుతానికి ఒక తమిళ సినిమాను చేస్తున్న ఈ అమ్మడిని ఒక వెబ్‌ సిరీస్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదించింది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజమో కానీ ప్రస్తుతానికి అధికారికంగా ఫరియా తెలుగు సినిమాలు ఏవీ కూడా చేయడం లేదు. ఫరియా అందంకు ముందు ముందు అయినా ఆమెకు ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.