Begin typing your search above and press return to search.

పెళ్లి విషయంలో ఫరియా ప్లాన్స్ భలే..!

హైదరాబాద్‌ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   27 April 2024 5:12 AM GMT
పెళ్లి విషయంలో ఫరియా ప్లాన్స్ భలే..!
X

హైదరాబాద్‌ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతకు ముందు నుంచే ఇండస్ట్రీలో రాణించేందుకు కష్టపడుతున్న ఫరియాకు జాతిరత్నాలు సినిమా లక్కీగా మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్‌ లో ముందుకు సాగుతుంది.

హైట్‌ ఎక్కువగా ఉండటం వల్ల అందరు యంగ్‌ హీరోలకు ఈ అమ్మడు సెట్‌ అయ్యే పరిస్థితి లేదు. అయినా కూడా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ తన క్రేజ్ ని పెంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది. హీరోయిన్ గానే నటించాలి అని పట్టింపు లేకుండా ఎలాంటి పాత్రకు అయినా సిద్ధం అన్నట్లుగా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది.

తాజాగా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అల్లరి నరేష్ తో కలిసి ఫరియా పలు మీడియా సమావేశాల్లో పాల్గొంది. అంతే కాకుండా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో ఫరియా పెళ్లి గురించి ప్రశ్నించిన సమయంలో ఆ ఒక్కటి అడక్కు అంటూనే తాను కోరుకుంటున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను వివరించింది. ఫరియా అబ్దుల్లా మొదటి నుంచి కూడా హ్యుమర్‌ ను ఇష్టపడే వ్యక్తి. తన భర్త కూడా కాస్త హ్యూమర్ ఎక్కువ ఉండే విధంగా ఆమె కోరుకుంటుంది.

పెళ్లి, భర్త గురించి ఫరియా మాట్లాడుతూ... నేను ఆరు అడుగులు ఉంటాను. నా కంటే పొడవుగా ఉండే వ్యక్తి ని భర్తగా కోరుకోవడం లేదు. నా హైట్‌ కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా కష్టాలు చూసి జీవితంలో ఇంత దూరం వచ్చాను.

ఇకపై అయినా జీవితంలో సంతోషం ఉండాలని ఆశ పడుతున్నాను. అందుకే నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫన్ గా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఎంత కష్టంలో ఉన్నా లైఫ్ లో ఫన్‌ ను మిస్ కాకుండా చూసుకునే వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను అంటూ ఫరియా చెప్పుకొచ్చింది.

నాకు కాబోయే వాడు అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఫరియా మాత్రం సింపుల్ గా ఫన్ గా ఉంటే చాలు అనుకుంది. నిజమే జీవితంలో ఫన్‌ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత కష్టం అయినా కూడా జీవితం సాఫీగా సాగుతుంది. కనుక పెళ్లి విషయంలో ఫరియా ఆలోచన సరైనది.