పిక్‌టాక్ : వైట్ బికినీలో ఫరియా జలకాలాట
ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను మించి మరీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎత్తుకు ఎత్తు.. అందంకు అందం ఉన్న ఫరియా ఏ ఫోటోలు షేర్ చేసినా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది.
By: Tupaki Desk | 28 July 2025 6:27 PM ISTజాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొదటి సినిమా జాతిరత్నాలు లో చిట్టి పాత్రలో అలరించిన ఫరియా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ లక్ కలిసి రాకపోవడంతో లీడ్ రోల్స్ చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. చిన్న పాత్రల్లో నటించిన సినిమాలు సైతం ఈమెకు గుర్తింపును తెచ్చి పెట్టడంలో విఫలం అయ్యాయి. దాంతో ఫరియా సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో తప్పకుండా ముందు ముందు మంచి సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్‌తో పాటు, ఈమె ఫోటోలు షేర్ చేసిన సమయంలో ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను మించి మరీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎత్తుకు ఎత్తు.. అందంకు అందం ఉన్న ఫరియా ఏ ఫోటోలు షేర్ చేసినా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అందమైన ఫరియా అబ్దుల్లా మరోసారి తన అందంతో సర్‌ప్రైజ్ చేసింది. ఈసారి వైట్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తూ ఫరియా వీడియోను షేర్ చేసింది. రివర్స్‌లో స్విమ్ చేస్తూ తన అందాన్ని చూపించిన ఫరియా అబ్దుల్లాను నెటిజన్స్ అలాగే చూస్తూ ఉండి పోతున్నారు. ఆమె స్టోరీని అత్యధికులు లైక్ చేయడంతో పాటు, ఎంతో మంది కామెంట్స్ చేస్తూ, అందంను పొగుడుతూ కామెంట్స్ చేయడం మనం చూడవచ్చు.
వైట్ బికినీలో ఫరియా మెరిసి పోతుందని చాలా మంది స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అని మరోసారి ఈ వీడియోను చూస్తే నిరూపితం అయిందని నెటిజన్స్ చాలా మంది కామెంట్స్ లో ఆమె అందం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, అలరించే స్కిన్ షో ఈమె చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈమె ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. నెట్టింట ఈమె షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకట్టుకునే అందంతో పాటు, ఫోటో జెనిక్ ఫేస్ కావడం వల్ల ఫరియా అబ్దుల్లా ఫోటోలు ఎప్పుడు షేర్ చేసిన వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం.
గత సంవత్సరం ఈమె ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2 సినిమాల్లో కనిపించింది. మత్తు వదలరా 2 సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోతో పాటు సమానమైన లీడ్ రోల్‌ను ఈమె సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కామెడీ టైమింగ్‌తో మెప్పించింది. కామెడీ పాత్రలకు న్యాయం చేస్తుంది అనే అభిప్రాయం ఇప్పటికే నెటిజన్స్‌లో పడింది. ఇండస్ట్రీ వారు కూడా ఈమెకు కామెడీ పాత్రలు ఉంటే ఆఫర్ చేస్తున్నారు. ఆకట్టుకునే కామెడీతో ఇప్పటికే ప్రేక్షకులను నవ్వించిన ఫరియా అబ్దుల్లా ముందు ముందు మరిన్ని కామెడీ పాత్రలతో ఆకట్టుకుంటుందేమో చూడాలి. సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపై, ఓటీటీ లోనూ ఈమె సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
