ముసి ముసి నవ్వులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఫరియా అబ్దుల్లా!
ఏ హీరోయిన్ అయినా సరే ఒక మంచి పాత్ర దొరికితే ఆ పాత్రకు తగ్గ కంటెంట్ పడింది అంటే.. ఇక తమ టాలెంట్ తో రెచ్చిపోతారు అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 2 Feb 2026 1:00 PM ISTఏ హీరోయిన్ అయినా సరే ఒక మంచి పాత్ర దొరికితే ఆ పాత్రకు తగ్గ కంటెంట్ పడింది అంటే.. ఇక తమ టాలెంట్ తో రెచ్చిపోతారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎంతోమంది అలా మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒకప్పుడు తన గ్లామర్ తో అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లాకు ఇప్పుడు సరైన క్యారెక్టర్ లభించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తన నటన కంటే కూడా తన హైట్ తోనే అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలు అయితేనే ఈమెకు సెట్ అవుతారనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ఇటీవల విశ్వక్ సేన్ కూడా సిజి ఇంకా డెవలప్ అయితే ఆమెతో సినిమా చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాంటి ఫరియా అబ్దుల్లా తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అయితే అందుకు తగ్గట్టుగా అవకాశాలైతే రాలేదు. ముఖ్యంగా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా.
కానీ ఎట్టకేలకు ఆమె కష్టాన్ని దర్శక నిర్మాతలు గమనించినట్టు ఉన్నారు. అందుకే ఆమెకు తిరువీర్ హీరోగా నటిస్తున్న భగవంతుడు సినిమాలో స్పెషల్ రోల్ ఇచ్చి ఆమె నటనను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఇందులో తొలిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించడమే కాకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించబోతోంది అంటూ మేకర్స్ స్పష్టం చేశారు.
ఎప్పుడు చిట్టిపొట్టి బట్టలతో గ్లామర్ టచ్ ఇస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న చిట్టి.. ఈ సినిమాలో లంగా ఓణీతోనే కాదు తన నటనతో కూడా మెప్పిస్తానని చెబుతోంది మరి భగవంతుడు సినిమా చిట్టికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ఇందులో ఉండగా మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా చీర కట్టుకొని చేతిలో గులాబీ పట్టుకొని ముసి ముసి నవ్వులతో ఫాలోవర్స్ హృదయాలను దోచుకుంటుంది . బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న ప్లెయిన్ శారీ కట్టుకున్న ఫరియా అబ్దుల్లా కాటుక కళ్ళతో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి భగవంతుడు సినిమాతో ప్రేక్షకులను తన వినూత్నమైన నటనతో అలరించడానికి సిద్ధమవుతున్న ఈమె ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
