Begin typing your search above and press return to search.

పాపం చిట్టి.. ఆ పేరే శాపం అయ్యింది!

'జాతిరత్నాలు' సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.

By:  Tupaki Desk   |   1 May 2026 11:33 AM IST
పాపం చిట్టి.. ఆ పేరే శాపం అయ్యింది!
X

'జాతిరత్నాలు' సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి చూడ్డానికి నార్త్‌ ముద్దుగుమ్మ అన్నట్లుగా ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో స్ట్రగుల్‌ అయిన తర్వాత ఫరియా కు జాతిరత్నాలు వంటి మంచి విజయం దక్కింది. ఆ సినిమాతో నవీన్‌ పొలిశెట్టితో పాటు అందరికీ మంచి పేరు వచ్చింది. దర్శకుడు అనుదీప్‌ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాడో తెలిసిందే. ఆ తర్వాత ఆయన పెద్దగా హిట్‌లు తీయక పోవడంతో ఆయన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక చిట్టి పాత్రతో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకు పోవాలని ఆశించింది. కానీ తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్‌ క్రేజీ హీరోలు ఈమెను దూరం పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పైగా ఈ అమ్మడి హైట్‌ సైతం సమస్యగా మారిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

జాతిరత్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా....

ఫరియా గ్లామర్‌ పాత్రల్లో కనిపించినా, ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త అందాల ఆరబోత చేసినా కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. చిట్టి ఇలా ఉందేంటి అంటూ చాలా మంది బాహాటంగానే, ఏకంగా ఆమె టైమ్‌ లైన్‌కి వెళ్లి మరీ బ్యాడ్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్స్‌ మాదిరి మీరు కాదు అనుకున్నాం. కానీ మేము తప్పు అని నిరూపించారు. మాకు ఈ చిట్టి వద్దు, మీరు చిట్టి మాదిరిగా ఉంటేనే అభిమానిస్తాం అంటూ చాలా మంది ఆమెకు కామెంట్‌ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చింది. ఆమె నటించిన గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌ పట్ల పూర్తి సంతృప్తితో లేనట్లుగా చెప్పింది. తనకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని కూడా ఆమె బాధ పడుతుంది. అందుకు కారణం తన మొదటి సినిమాలోని పాత్ర అని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియాలో ఫరియా అబ్దుల్లా ఫోటోలు...

సోషల్‌ మీడియాలో చిట్టి ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఫరియాను హాట్‌ లుక్‌ లో చూసేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఫిల్మ్‌ మేకర్స్‌ సైతం ఆమెను గ్లామర్‌ రోల్స్‌ లో చూపించేందుకు ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె కూడా అందాల ఆరబోత చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకునేందుకు గాను అన్ని పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాకుండా గ్లామర్‌ పాత్రలు చేయడం ద్వారా కూడా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొంది. అయితే బోల్డ్‌ లుక్‌ లో కనిపించిన వెంటనే చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిట్టి పాత్రలో నటించడం వల్లే ఇప్పుడు ఫరియా కెరీర్‌ ఇలా అయ్యిందని కొందరు అంటున్నారు.

గాయపడ్డ సింహం సినిమా...

ఫరియా ప్రస్తుతం 'గాయపడ్డ సింహం' పై చాలా ఆశలు పెట్టుకుంది. విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫరియా చెబుతోంది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు. మానస చౌదరి మరో హీరోయిన్‌గా నటించింది. జేడీ చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు కశ్యప్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. మే 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కామెడీ డ్రామా చాలా మందికి కనెక్ట్‌ కాబోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. యూఎస్‌ఏ కి వెళ్లాలని కలలు కన్న ఒక యువకుడి జర్నీకి సంబంధించిన కథ ఇది. అతడు చివరకు యూఎస్‌ఏ వెళ్లాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలని తాజా ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత అయినా ఫరియా కి చిట్టి ట్యాగ్‌ పోతుందా అనేది చూడాలి.