Begin typing your search above and press return to search.

ఫరియా రెడ్ గ్లామర్.. వ్వాటే క్యూట్ లుక్స్!

ఎరుపు రంగు గౌన్‌తో చేసిన ఈ బోల్డ్ ఫొటో షూట్‌లో ఫరియా గ్లామర్, క్యూట్‌నెస్ రెండింటినీ సమపాళ్లలో చూపించింది.

By:  Tupaki Desk   |   8 May 2025 6:04 AM
ఫరియా రెడ్ గ్లామర్.. వ్వాటే క్యూట్ లుక్స్!
X

ఫరియా అబ్దుల్లా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు డ్రెస్‌లో ఆమె ఫోజులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఆమె స్టైలిష్ లుక్, వెనకకీ వదిలిన జుట్టు, ఫ్లవర్ హేర్ పిన్‌ స్టయిల్ ఆమెకు మరింత ప్రత్యేకత తెచ్చింది. ఒక్కో ఫొటోలో ఫరియా ఇచ్చిన హావభావాలు ఫ్యాన్స్‌కి కనువిందు చేస్తున్నాయి.

ఫరియా కెరీర్ విషయానికొస్తే.. ‘జాతిరత్నాలు’ మూవీతో ఘనవిజయం అందుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత ‘మత్తు వదలరా 2’, ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఫరియా, టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తన సొగసు, టాలెంట్ నః రెండింటినీ సమంగా హైలెట్ చేస్తూ, గ్లామర్ పరంగా కూడా ఎక్స్‌ప్లోర్ అవుతోంది.

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫొటో షూట్ మరికొంత మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కళ్లల్లో పడేలా చేసింది. ఎరుపు రంగు గౌన్‌తో చేసిన ఈ బోల్డ్ ఫొటో షూట్‌లో ఫరియా గ్లామర్, క్యూట్‌నెస్ రెండింటినీ సమపాళ్లలో చూపించింది. ఫొటోలు మాత్రమే కాదు, అవి తీసిన విధానం, లైట్ ఎఫెక్ట్స్, ఫరియా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఆన్‌లైన్‌లో మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.

ఫరియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తరచూ ఫ్యాషన్ ఫొటోషూట్లతో పాటు వ్యక్తిగత లైఫ్‌కి సంబంధించిన కొన్ని ఫన్నీ అప్‌డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్‌కి క్లోజ్‌గా ఉండే ప్రయత్నం చేస్తూ, ఒక వెర్షటైల్ యాక్ట్రెస్‌గా తనను మలచుకుంటోంది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌లో అమ్మడు ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. చివరగా మత్తు వదలరా 2సినిమాతో అమ్మడు మంచి విజయాన్ని అందుకుంది. ఇక నెక్స్ట్ ఒక తమిళ సినిమాలో కనిపించనుంది. తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు టాక్.