Begin typing your search above and press return to search.

ప్రైవేట్‌ బీచ్‌లో ఫరియా ఎంజాయ్‌

టాలీవుడ్‌లో గత ఏడాది ఈమె మత్తువదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 4:59 PM IST
ప్రైవేట్‌ బీచ్‌లో ఫరియా ఎంజాయ్‌
X

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఉత్తారది ముద్దుగుమ్మల మాదిరిగా స్కిన్‌ షో చేయడంతో పాటు, కాస్త అటు ఇటుగా ఉత్తరాది అమ్మాయి అనే విధంగా ఉంటుంది. అందుకే ఫరియా అబ్దుల్లాకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. కానీ అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈమె చేసిన జాతిరత్నాలు మినహా మరే సినిమాలు హిట్‌ కాలేదు. అయినా కూడా ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా ఈమె ఇతర భాషల్లోనూ నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.


టాలీవుడ్‌లో గత ఏడాది ఈమె మత్తువదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దాంతో ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. హీరోయిన్‌గా ఈమెకు రావాల్సిన గుర్తింపు వచ్చినప్పటికీ ఆఫర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. గతంలో ఈమె చేసిన సినిమాలు, ప్రత్యేక పాటలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫరియా షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇన్‌స్టాలో మిలియన్ ఫాలోవర్స్‌కి పైగా కలిగి ఉన్న ఫరియా అబ్దుల్లా తాను వెళ్లిన పాండిచేరి ప్రైవేట్‌ బీచ్‌ అందాలను చూపడంతో పాటు, తాను చేసిన ఎంజాయ్‌ను సైతం చూపించింది. ఫరియా అబ్దుల్లా తన అన్ని అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. నైట్‌ ఎఫెక్ట్‌లో, పార్టీ మూడ్‌లో తీసిన ఈ ఫోటోలు, వీడియోలు ఫరియా అబ్దుల్లా ఏ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తుందో అర్థం అయ్యేలా చేస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. నెట్టింట ఈమె షేర్‌ చేసే ప్రతి పోస్ట్‌ వైరల్‌ అవుతూ ఉంటుంది. ఈసారి కూడా ఈమె పోస్ట్‌ అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా ఉంది.

హైదరాబాద్‌లో పుట్టిన ఫరియా అబ్దుల్లా థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించింది. ఇటీవలే ఈమెకు గద్దర్ తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అవార్డు సైతం దక్కింది. సినిమా కెరీర్‌ కోసం తెలుగు నేర్చుకున్న ఫరియా ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుగును మాట్లాడుతుంది. యంగ్‌ హీరోలతో పాటు సీనియర్‌ హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు రెడీ అంటున్న ఫరియా అబ్దుల్లాకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ముందు ముందు అయినా ఈమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. కోలీవుడ్‌లో ఈమె ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అక్కడ ఈమె కెరీర్‌ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి.