Begin typing your search above and press return to search.

డాన్ -3పై డైరెక్ట‌ర్ సెంటిమెంట్ ఇది!

'డాన్ 'సీరిస్ లో భాగంగా 'డాన్ -3' తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2023 12:30 PM GMT
డాన్ -3పై డైరెక్ట‌ర్ సెంటిమెంట్ ఇది!
X

'డాన్ 'సీరిస్ లో భాగంగా 'డాన్ -3' తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో హీరోగా ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నట్లు వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా డాన్ -3పై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. షారుక్ ఖాన్ న‌టించిన డాన్ లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌డం ఏంట‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విమర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. ర‌ణ‌వీర్ ఆ పాత్ర‌కి స‌రిపోడ‌ని..డాన్ గా షారుక్ అయితేనే బాగుంటుంద‌ని అభిమానులు కామెంట్లు చేసారు. తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై ప‌ర్హాన్ అక్త‌ర్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

'డాన్ -2' లో షారుక్ ఖాన్ ఎంపిక చేసామ‌ని చెప్పిన‌ప్పుడు ఇలాగే విమ‌ర్శించారు. అమితాబ‌చ్చ‌న్ ని ఎందుకు తీసుకోలేద‌న్నారు. కానీ డాన్-2 విడుద‌ల‌య్యాక షారుక్ నిజ‌మైన డాన్ లా ఉన్నాడ‌ని ప్ర‌శంసించారు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంది. డాన్ -3 లో ర‌ణ‌వీర్ ని తీసుకున్నామ‌ని చెప్పి న‌ప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లొస్తున్నాయి. ర‌క‌ర‌కాల ట్రోలింగ్ లు జ‌రుగుతున్నాయి. కానీ ర‌ణ‌వీర్ గొప్ప న‌టుడు.

ఆ విష‌యం అంద‌రికీ తెలుసు. ఆయ‌న పోషించిన పాత్ర‌లే ఆ స్థాయికి చేర్చాయి. డాన్ -3 లో గొప్ప‌గా న‌టిస్తాడ‌ని న‌మ్మ‌కం నాకుంది. ఈ సినిమా కోసం ఆయ‌నా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో త‌న పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేసాడు. అలాగే చిన్న భ‌యం కూడా ఉంది. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా క‌థ రాసే బాధ్య‌త నాపై ఉంది' అని అన్నారు.

అలాగే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలిపారు. ఇప్ప‌ట్లో లాంచ్ అవ్వ‌ద‌ని...2025 వ‌ర‌కూ ఆగాల్సిందేన‌న్నారు. ఇంకా న‌టీన‌టుల ఎంపిక పూర్తి కాలేద‌ని.. ఈసారి ఆడియ‌న్స్ కొత్త డాన్ ని చూస్తారని ధీమా వ్య‌క్తం చేసారు. మొత్తానికి ప‌ర్హాన్ అక్త‌ర్ మాటల్లో విమ‌ర్శ సెంటిమెంట్ త‌న‌కి మ‌రోసారి క‌లిసొస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని ప‌ర్హాన్ అక్త‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు.