Begin typing your search above and press return to search.

తాగిన మైకంలో అతిథినే తిట్టేసిన లేడీ డైరెక్ట‌ర్‌

తాజా చాటింగ్ సెష‌న్ లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ ఎపిసోడ్ లో లేడీ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఫ‌రాఖాన్. పాపుల‌ర్ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ గా ఆమె సుప‌రిచితురాలు.

By:  Tupaki Desk   |   27 May 2024 3:53 PM GMT
తాగిన మైకంలో అతిథినే తిట్టేసిన లేడీ డైరెక్ట‌ర్‌
X

పాపుల‌ర్ కొరియోగ్రాఫ‌ర్ కం లేడీ డైరెక్ట‌ర్ .. తాను స్వ‌యంగా నిర్వ‌హించిన ఓ పార్టీలో ముఖ్య అతిథిని తిట్టేసింది. అయితే తాను అప్ప‌టికే తాగి ఉన్నాన‌ని అంగీక‌రించింది. తాజా చాటింగ్ సెష‌న్ లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ ఎపిసోడ్ లో లేడీ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఫ‌రాఖాన్. పాపుల‌ర్ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ గా ఆమె సుప‌రిచితురాలు.

డైరెక్టర్-కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ప్ర‌ఖ్యాత న‌టుడు ఎడ్ షీరాన్ కోసం తాను హోస్ట్ చేసిన పార్టీలో తాను బాగా తాగినట్లు ఒప్పుకుంది. గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించిన ఫరా..ఇంగ్లీష్ గాయ‌కుడు కం ర‌చ‌యిత ఎడ్ షీర‌న్ కోసం హోస్ట్ చేసిన పార్టీలలో ఒకదాని గురించి ఓపెన‌య్యారు. ఫరా ఒకసారి ఎడ్‌ని ఆహ్వానించార‌ని ఆపై అతడిని పార్టీ నైట్ లో గుర్తించడంలో విఫలమైందని కపిల్ పేర్కొన్నాడు. ''ఫరా చాలా గొప్ప హోస్ట్, కొన్నిసార్లు ఆమె అతిథులను ఆహ్వానిస్తుంది. కానీ వారిని గుర్తించడంలో విఫలమవుతుంది. ఒకసారి ఎడ్ షీరాన్ త‌న‌ను పార్టీలో సందర్శించాడు. కానీ అతడిని గుర్తించలేదు'' అని కపిల్ చెప్పాడు. అయితే ఆ రోజు ఏం జ‌రిగిందో ఫరా స్పష్టం చేసింది.

లేదు, నేను అతడిని గుర్తించాను.. ఎడ్ షీరన్ వచ్చాక అందరం కొంచెం తాగాము. డీజే ఏదో ప్లే చేస్తోంది. నేను మత్తులో DJ వద్దకు వెళ్లి అతడిని దుర్భాషలాడాను. నేను అతడిని అడిగాను.. ''క్యా మైయ్యత్ కే గానే బాజా రహా హై'' (మీరు ఈ అంత్యక్రియల పాటలను ఎందుకు ప్లే చేస్తున్నారు) అని అడిగాను. దానికి డీజే బదులిచ్చాడు. ''మేడమ్.. నేను ఎడ్ షీరన్ పాటలు ప్లే చేస్తున్నాను'' అన్నాడు. నేను సరే అయితే, కొనసాగించండి అన్నాను! అని ఆమె నవ్వుతూ చెప్పింది.

ఎడ్ రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించాడు. ఫరా అతడి కోసం ఇప్పటివరకు రెండు పార్టీలను నిర్వహించారు. మొదటి పార్టీ 2017లో జరిగింది. మలైకా అరోరా, అభిషేక్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌ సహా పలువురు బాలీవుడ్ తారలను ఫరా ఆహ్వానించారు. ఈ సంవత్సరం ఎడ్ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఫరా తన బాంద్రాలోని మన్నత్‌లో ఎడ్ కోసం విందును ఏర్పాటు చేయడానికి SRKతో పార్టీలో చేరారు. వారి పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇంతలో ఎడ్ గత వారం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కూడా కనిపించాడు. షారుఖ్ ఖాన్‌ను కలవడం గురించి మాట్లాడాడు. నేను 2017లో చివరిసారిగా ఇక్కడకు వచ్చినప్పుడు మేము కలుసుకున్నాము.. కానీ ఈసారి అది అద్భుతంగా ఉంది. ఖాన్ చాలా మంచి వ్యక్తి.. ఆయ‌న‌ ఎంత పెద్ద స్టార్.. ఎంతో సింపుల్ గా ఉన్నాడు. నేను చాలా సరదాగా గడిపాను. నేను ఆయ‌న‌ కుటుంబాన్ని కలుసుకున్నాను. కొన్ని పాటలను జామ్ చేసాము. వారు నాకు కొద్దిగా నృత్యం చేయడం నేర్పించారు అని ఎడ్ చెప్పారు.