మత్తులో టబును ముద్దాడబోయాడా?
ఈ సినిమా రిలీజ్ అనంతరం నటుడు డానీ డెంజోగ్ప ఓ పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీకి చెల్లెలు టబును కూడా తీసుకెళ్లిందట.
By: Tupaki Desk | 4 July 2025 10:00 PM ISTబాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఫరానాజ్. 1984-2005 మధ్య బాలీవుడ్ లో బిజీగా సినిమాలు చేసింది ఫరానాజ్. 17 ఏళ్ల సినీ కెరీర్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. అందుకు కారణం తన కోపమే. ఆవేశంతో చేసిన ఒక పనివల్ల హీరోయిన్ గా మొదలైన కెరీర్ బుల్లి తెరకు పడిపోయింది. 'కసం వర్దకీ' సినిమాలో చుంకీ పాండేకి జోడీగా నటించింది ఫరా. ఆ సినిమా షూటింగ్ సమయంలే పాండే జోక్ వేస్తే ఫరాకి ఒళ్లుమండి అతడి చెంపమీద లాగిపెట్టి కొట్టింది.
అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇదే సినిమాకు మాధురీ దీక్షిత్ ని తీసుకుంటే బాగుందేని అనీల్ కపూర్ అభిప్రాయ పడ్డాడట. ఈ విషయం ఫరానాజ్ కి తెలిసి అతడిని బెదిరిచిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇవన్నీ ఫరానాజ్ కెరీర్ కి అతి పెద్ద వివాదంగా మారాయి. అప్పటి నుంచి ఫరానాజ్ కి కోపం ఎక్కువ..అలాంటి నటి సినిమాకు పనికి రాదంటూ ప్రోజెక్ట్ అయింది. దీంతో ఫరానాజ్ ఇమేజ్ దెబ్బతింది. ఆ తర్వాత ఫరానాజా నటించిన `దిల్ జలా` సినిమా హిట్ అయింది.
ఈ సినిమా రిలీజ్ అనంతరం నటుడు డానీ డెంజోగ్ప ఓ పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీకి చెల్లెలు టబును కూడా తీసుకెళ్లిందట. ఆ పార్టీలో టబు పుల్లుగా తాగి మతి స్థిమితం కోల్పోయిందట. అదే సమయంలో అదును చూసుకుని జాకీ ష్రాప్ టబును ముద్దాడబోయాడట. అది చూసిన ఫరా అతడిని చెడుగుడు ఆడుకుందట. ఎలాగూ అతడిని ఆ సమయంలో డానీ బయటకు పంపించడంతో పెద్ద గొడవ తప్పింది. కానీ జాకీ తీరును ఫరానాజ్ మీడియా ముందుకు తీసుకెళ్లి ఎండగట్టింది.
ఫరానాజ్ తెలుగులో 'ఒంటరి పోరాటం', 'విజేత', 'విక్రమ్' లాంటి చిత్రాల్లోనూ నటించింది. ఫరానాజ్ రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ ను మొదట వివాహం చేసుకుంది. కానీ మనస్పర్దల కారణంగా 1997లో విడిపోయారు. ఆ తర్వాత నటుడు సుమిత్ సైగల్ ను రెండవ వివాహం చేసుకుంది. అతడికి అది రెండవ పెళ్లే. పిల్లలు వద్దనుకుని ఇద్దరు వివాహం చేసుకున్నారు.
