Begin typing your search above and press return to search.

అప్డేట్ కోసం ఫ్యాన్స్ మరింత వెయిట్ చేయిస్తున్న స్టార్ తనయుడు..!

అయితే ఈ అక్కినేని హీరో నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 7:07 AM GMT
అప్డేట్ కోసం ఫ్యాన్స్ మరింత వెయిట్ చేయిస్తున్న స్టార్ తనయుడు..!
X

అక్కినేని నట వారసుడు అఖిల్ చేసిన ఐదు సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వగా మిగతా సినిమాలన్నీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ భారీ బడ్జెట్ సినిమాతో వచ్చి బొక్క బోర్లా పడ్డాడు అఖిల్. ఆ సినిమాకు తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని బాగున్నా కథ కథనాల వల్ల సినిమా డిజాస్టర్ గా మారింది. ఏజెంట్ ఫ్లాప్ ని డైజెస్ట్ చేసుకునేందుకు అఖిల్ చాలా టైం తీసుకున్నాడని చెప్పొచ్చు.


అయితే ఈ అక్కినేని హీరో నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అఖిల్ తర్వాత సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ యువి క్రియేషన్స్ తెరకెక్కించాలని ప్లాన్ చేసిన ఈ సినిమా సలార్ మేకర్స్ హోంబలె ప్రొడక్షన్స్ చేతుల్లోకి వెళ్లిందని టాక్. అయితే సినిమా గురించి ఓ పక్క డిస్కషన్స్ జరుగుతున్నా అఫీషియల్ గా మాత్రం అప్డేట్స్ బయటకు రావట్లేదు.

2015 లో అఖిల్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు అఖిల్. తెరంగేట్రం చేసి 10 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలే చేశాడు అఖిల్. అంటే రెండేళ్లకు ఒక సినిమా చొప్పున పదేళ్లకు ఐదు సినిమాలు చేశాడు. రెండేళ్లకు ఒక సినిమా చేయడం అది కాస్త నిరుత్సాహ పరిస్తే మరో రెండేళ్ల దాకా సినిమా చేయకపోవడం ఇదే అఖిల్ వరుస అయ్యింది. ఇంట్లో సీనియర్ హీరో తండ్రి నాగార్జున ఉన్నా సరే అఖిల్ కెరీర్ ని గాడిన పెట్టే ప్రయత్నాలు జరగడం లేదు.

అక్కినేని లెగసీని అఖిల్ కొనసాగిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. హీరోగా యాక్షన్, ఫైట్స్, డాన్స్ అన్నిటిలో స్ట్రాంగ్ గా మారిన అఖిల్ కథల విషయంలో ఇంకాస్త ఫోకస్ చేయాల్సి ఉంది. ఏజెంట్ సినిమా తర్వాత కథల ఎంపిక కోసమే అఖిల్ టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అఖిల్ ఆరో సినిమా ధీర టైటిల్ తో వస్తుందని పీరియాడికల్ మూవీగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని టాక్. అయితే అఫీషియల్ గా ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.