Begin typing your search above and press return to search.

చిరుని రిక్వస్ట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్

దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా రిక్వస్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 10:39 AM GMT
చిరుని రిక్వస్ట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్
X

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. మెహర్ రమేష్ దశాబ్దం తర్వాత మెగా ఫోన్ పట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయిన కానీ ఎలాంటి మార్పు లేకుండా మళ్ళీ అప్పటి తన ట్రాక్ రికార్డ్ ని భోళా శంకర్ తో కొనసాగించాడు అనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. చిరంజీవి ఒప్పుకున్నారు అంటే ఏదో విషయం ఉంటుందనే అభిప్రాయం గతంలో వినిపించేది.

అయితే భోళా శంకర్ కేవలం మెహర్ రమేష్ ని నిలబెట్టడానికి చేసినట్లు ఉంది తప్ప కథలో ఎలాంటి దమ్ము లేదని ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఫీడ్ బ్యాక్. మెగా ఫ్యాన్స్ సైతం భోళా శంకర్ మూవీపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. రాజకీయాల నుంచి సినిమాల వైపు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేస్తే అందులో మూడు రీమేక్ స్టోరీస్ తో తెరకెక్కినవే.

ఖైదీ 150, గాడ్ ఫాదర్, ఇప్పుడు భోళా శంకర్ మూవీస్ మెగాస్టార్ నుంచి వచ్చాయి. వీటిలో మొదటి రెండు సినిమాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకుంటే భోళా శంకర్ కంప్లీట్ గా డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా రిక్వస్ట్ చేస్తున్నారు. ఇకనైనా రీమేక్ కథలని చిరంజీవి పక్కన పెట్టాలని కోరుతున్నారు. కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్స్ తమ వయస్సుకి సరిపోయే కథలని ఎంపిక చేసుకుంటున్నారు.

విక్రమ్, జైలర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెగాస్టార్ కూడా ఇంకా హీరోయిన్స్ తో డ్యూయెట్స్ కాకుండా యాక్షన్ ప్యాక్డ్ పవర్ ఫుల్ కథలని ఎంపిక చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. రొటీన్ మాస్ మసాలా కథలకి పూర్తిగా కాలం చెల్లిందని, కథలో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ అస్సలు చూడటం లేదని ఆచార్య, భోళా శంకర్ సినిమాలతో క్లారిటీ వచ్చింది.

దీంతో ఇకనైనా కాస్తా మెగాస్టార్ స్టైల్ మార్చుకొని రీమేక్ లని పూర్తిగా పక్కన పెట్టి బలమైన కథలతో ప్రేక్షకులకి కొత్తదనం అందించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. అయితే మెగాస్టార్ కి ఎక్కువ సక్సెస్ లు ఇచ్చిన రొటీన్ కమర్షియల్ జోనర్ స్టోరీస్ పక్కన పెట్టి అభిమానుల రిక్వస్ట్ ని అర్ధం చేసుకొని నెక్స్ట్ సినిమాల విషయంలో అయిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదంటే మరల రొటీన్ మాస్ మసాలా మూవీతోనే వస్తారా అనేది చూడాలి.