Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరి లవ్ స్టోరీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

విజయ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ కూడా కొనసాగిస్తుంది రష్మిక.

By:  Tupaki Desk   |   5 March 2024 1:30 AM GMT
వాళ్లిద్దరి లవ్ స్టోరీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

టాలీవుడ్ లో క్రేజీ ఆన్ స్క్రీన్ కపుల్స్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ రష్మిక ముందుంటారు. వీరితో పాటుగా మరికొన్ని జంటలు కూడ ఉండగా విజయ్ తో రష్మిక జోడీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. వీరిద్దరు కలిసి నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ అంచనాలను అందుకోలేదు. అయితే ఆ రెండు సినిమాలు రష్మిక కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యాయి. తెలుగులో రష్మిక స్టార్డం తెచ్చుకునేందుకు విజయ్ సినిమాలు బాగా హెల్ప్ అయ్యాయి. విజయ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ కూడా కొనసాగిస్తుంది రష్మిక.


ఇద్దరి మధ్య ఓ లవ్ స్టోరీ నడుస్తుందని మీడియా కోడై కూస్తుంది. అన్ని విషయాల గురించి ప్రస్తావించే విజయ్, రష్మిక వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి మాత్రం నోరు విప్పరు. అయితే ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటే మాకేంటి మరోసారి ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కావాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా రష్మిక విజయ్ తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని త్వరలోనే అది జరుగుతుందని వెల్లదించింది.

విజయ్ కూడా రష్మికతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు కలిసి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరి కెమిస్ట్రీ ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుంది. ఇద్దరి మధ్య ఉన్న బయట క్లోజ్ నెస్ తెర మీద మరింత అందంగా కనిపిస్తుంది. విజయ్ తో సినిమా అంటే మారు మాట మాట్లాడకుండా రెడీ అంటుంది రష్మిక. సో ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా లవ్ స్టోరీ అయ్యుండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని పూర్తి చేసే బిజీలో ఉన్నాడు. ఆ తర్వాత గౌతం తిన్ననూరి సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందేమో చూడాలి. శ్రీలీల, త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్ ఇలా చాలా మంది హీరోయిన్స్ పేరు చర్చల్లో ఉండగా వారందరినీ కాదని రష్మికని తీసుకుంటా లేదా అన్నది చూడాలి. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న గౌతం సినిమా కోసం విజయ్ దేవరకొండ సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. రౌడీ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.