కూలీపై రోజు రోజుకీ పెరుగుతున్న అంచనాలు
లోకేష్, రజినీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో కూలీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉండగా, ఆ అంచనాలను సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ తో ఆకాశానికి పెంచేశారు లోకేష్ కనగరాజ్.
By: Tupaki Desk | 4 July 2025 3:18 PM ISTఖైదీ, విక్రమ్, లియో సినిమాలో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకేష్, రజినీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో కూలీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉండగా, ఆ అంచనాలను సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ తో ఆకాశానికి పెంచేశారు లోకేష్ కనగరాజ్. కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున, సైమన్ అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. విలన్ అయినప్పటికీ కూలీలో లోకేష్ తనను చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారని నాగ్ ఆల్రెడీ చెప్పారు.
నాగ్ తో పాటూ కూలీ సినిమాలో పలు స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. కాలీషా పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, దహా క్యారెక్టర్ లో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. రాజశేఖర్ గా సత్యరాజ్, దయాల్ గా సౌబిన్ షాహిర్, ప్రీతిగా శృతి హాసన్ కూలీ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సినిమాలో ఉన్న స్టార్లందరూ కూలీ సినిమాలోనే ఉన్నారనేలా ఈ సినిమా క్యాస్టింగ్ ఉంది.
కూలీలో ఎంతో మంది స్టార్లు నటించడం వల్ల ఈ సినిమా ఆయా నటులకు సంబంధించిన ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సాధారణ ఆడియన్స్ కు కూడా కూలీ మంచి ట్రీట్ ను అందిస్తుందని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేయగా, ఒక్కో పోస్టర్ విభిన్న ఎమోషన్ ను కలిగి, సినిమాపై అంచనాలను పెంచుతుంది.
అయితే కూలీ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటివరకు ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, ఓ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేయగా వాటన్నింటికీ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లోకేష్ చాలా స్టైలిష్ స్టోరీ టెల్లింగ్ తో కూలీకి మాస్ అప్పీల్ ను తీసుకొచ్చి సినిమాకు స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేశారు. లోకేష్ ఇంతమంది స్టార్లను కూలీలో ఎలా హ్యాండిల్ చేశారో చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఆల్రెడీ కూలీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా తెలుగు రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడయ్యాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను ఏషియన్ ఫిల్మ్స్ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్