Begin typing your search above and press return to search.

'రామాయణ' గ్లింప్స్.. ప్రసాద్ ఐమ్యాక్స్ లో సందడే సందడి!

తాజాగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ ఇచ్చారు. గురువారం ఉదయం టైటిల్ గ్లింప్స్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   3 July 2025 9:17 AM
రామాయణ గ్లింప్స్.. ప్రసాద్ ఐమ్యాక్స్ లో సందడే సందడి!
X

ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో రామాయణ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సౌత్ స్టార్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాను ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్ర నిర్మాతలు రూపొందిస్తున్నారు.


సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. 2026 దీపావళి ఫెస్టివల్ కు తొలి భాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తాజాగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ ఇచ్చారు. గురువారం ఉదయం టైటిల్ గ్లింప్స్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా తొమ్మిది స్క్రీన్స్ లో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు రామాయణ మేకర్స్. అందులో భాగంగా హైద‌రాబాద్‌ ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌ లోని పీసీఎక్స్‌ లో విడుదల చేశారు. అయితే ఫ‌స్ట్ గ్లింప్స్‌ చూసేందుకు మీడియాతో పాటు ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మేకర్స్‌ రీసెంట్ గా పోస్టర్ ను రిలీజ్ చేసి.. అందరినీ సాదరంగా ఆహ్వానించారు.

దీంతో గురువారం ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఫుల్ గా సందడి నెలకొంది. యువత, పెద్దలు సహా అంతా పెద్ద ఎత్తున ఐమ్యాక్స్ కు చేరుకున్నారు. రామాయణ గ్లింప్స్ చూసి ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాకు ఎంత క్రేజ్ ఉందో వీడియోస్ ద్వారా అర్థమవుతోంది.

ఐమ్యాక్స్ లో పెట్టిన ఓ పోస్టర్ బోర్డు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాముడిగా రణబీర్ కపూర్ షాడో పోస్టర్ ను ఏర్పాటు చేశారు. వెనుక మండే సూర్యుడు ఉండగా.. రణబీర్ విల్లు, బాణం పట్టుకుని కనిపించారు. ఆ పిక్ కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోస్టర్ అదిరిపోయిందని.. గ్లింప్స్ అయితే నెవ్వర్ బిఫోర్ అని చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీధర్ రాఘవన్ రచయితగా వ్యవహరిస్తున్నారు. మరి వచ్చే ఏడాది దీపావళికి రానున్న రామాయణ ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.