రాజా సాబ్ రిలీజ్ సంగతేంటి? అసలేం జరుగుతోంది?
అయితే రాజా సాబ్ షూటింగ్ సైలెంట్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మోషన్ పోస్టర్ తో సినిమాపై మెల్లగా హైప్ క్రియేట్ చేశారు.
By: Tupaki Desk | 7 April 2025 5:11 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి రాజా సాబ్. కామెడీ హారర్ జోనర్ లో డైరెక్టర్ మారుతి ఆ మూవీని తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే రాజా సాబ్ షూటింగ్ సైలెంట్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మోషన్ పోస్టర్ తో సినిమాపై మెల్లగా హైప్ క్రియేట్ చేశారు. దీంతో రాజా సాబ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులు.. ఇటు మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.
నిజానికి.. గత ఏడాది డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందు అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ లెక్కన చూసుకుంటే మరో నాలుగు రోజుల్లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎలాంటి సౌండ్ లేదు. ఆ మధ్య.. దసరా లేదా దీపావళి కానుకగా సినిమా రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది.
కానీ అది కూడా క్లారిటీ లేదు. అదే సమయంలో డిసెంబర్ లో విడుదల అని కూడా టాక్ వినిపించింది. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ తో పాటు నాలుగు పాటల షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది.
దీంతో అసలు రిలీజ్ ఎప్పుడు చేస్తారో చెప్పండని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అసలేం జరుగుతుందని అడుగుతున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యమైందని.. ఏదో ఒకటి తేల్చండని కామెంట్లు పెడుతున్నారు. రాజా సాబ్ మేకర్స్ నిర్మిస్తున్న మరో సినిమా మిరాయ్.. రాజా సాబ్ తర్వాత స్టార్ట్ అయిందని, కానీ ఆ మూవీ మాత్రం కంప్లీట్ అవుతుందని అంటున్నారు.
మరి రాజా సాబ్ విషయంలో ఎందుకు లేట్ అని క్వశ్చన్ చేస్తున్నారు. అలా ఆలస్యమైతే మూవీపై బజ్ తగ్గిపోతుందని, రీసెంట్ గా వచ్చిన ఓ మూవీ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. అయితే అనేక కారణాల వల్ల రాజా సాబ్ లేట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం రాజా సాబ్ రిలీజ్ మ్యాటర్ తేల్చమని అడుగుతున్నారు.