తమన్ తీరుపై నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తి
ఇప్పుడు ఆ నందమూరి ఫ్యాన్సే ఫైర్ అవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. బాలయ్య నుంచి వచ్చిన రీసెంట్ మూవీ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వచ్చి హిట్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 3:32 PM ISTవరుస సక్సెస్‌లతో తమన్ చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్న విషయం తెలిసిందే. తమన్ కు ఈ మధ్య నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఎక్కువైన విషయం తెలిసిందే. బాలయ్య నుంచి వచ్చిన గత నాలుగు సినిమాలకూ తమనే సంగీత దర్శకుడు. బాలయ్య ప్రతీ సినిమాకూ తమన్ ది బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు.
దీంతో తమన్ మా వాడే అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఓన్ చేసుకుని నందమూరి తమన్ గా నామకరణం చేశారు. తమ హీరోకు మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించిన తమన్ పై ఇప్పుడు ఆ నందమూరి ఫ్యాన్సే ఫైర్ అవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. బాలయ్య నుంచి వచ్చిన రీసెంట్ మూవీ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వచ్చి హిట్ అయిన విషయం తెలిసిందే.
బాలయ్యను కొత్త అవతారంలో బాబీ ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ఆ సినిమా రిలీజై, సక్సెస్ అయిన తర్వాత కూడా బాలయ్య ఫ్యాన్స్ డాకు మహారాజ్ విషయంలో ఓ నిరాశ మిగిలే ఉంది. అది కూడా తమన్ వల్లే. డాకు మహారాజ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను రిలీజ్ చేయడంలో తమన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు.
ఈ ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో డాకు మహారాజ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చిన తమన్, ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశ చెందుతూ సోషల్ మీడియాలో తమన్ ను ట్యాగ్ చేసి వెంటనే డాకు మహారాజ్ ఓఎస్‌టీని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తుండగా, మరికొంతమంది మాట తప్పినందుకు తమన్ ను తిడుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా తమన్ మాత్రం ఈ విషయంలో అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్ఆనడు. ఇప్పటికైనా తమన్ డాకు మహారాజ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను రిలీజ్ చేసి మాట నిలబెట్టుకుంటాడా లేక ఇచ్చిన ప్రామిస్ ను బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ మాత్రం తమన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
