Begin typing your search above and press return to search.

వార్ 2పై ఆ వర్గం ఫ్యాన్స్ అప్సెట్.. ఎన్టీఆర్ తప్పుచేశాడా?

ఆంధ్రప్రదేశ్‌ ఏరియాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ హరి హర వీర మల్లు, లేటెస్టు వార్ 2 సినిమాల డే 1 రోజు కలెక్షన్లను పోల్చి చూస్తున్నారు.

By:  M Prashanth   |   15 Aug 2025 4:57 PM IST
వార్ 2పై ఆ వర్గం ఫ్యాన్స్ అప్సెట్.. ఎన్టీఆర్ తప్పుచేశాడా?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా ఫ్యాన్ వార్స్ ఎక్కువయ్యాయి. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. మరో హీరో ఫ్యాన్స్ లో ఓ వర్గం వ్యతిరేకత, నెగిటివ్ ట్రోలింగ్ ప్రచారం చేస్తారు. కావాలని పనిగట్టుకొని మరీ, ఇలా చేయడం ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై సోషల్ మీడియా ట్విట్టర్ లో మరో స్టార్ వర్గం అభిమానులు నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఏరియాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ హరి హర వీర మల్లు, లేటెస్టు వార్ 2 సినిమాల డే 1 రోజు కలెక్షన్లను పోల్చి చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూడింటికీ ఆంధ్రాలో టికెట్ ధరలు పెరిగాయి కాబట్టి. ఈక్రమంలోనే వార్ 2 సినిమా.. గేమ్ ఛేంజర్, హరిహర లకు దగ్గరగా లేదని నెంబర్స్ పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. వార్ 2 స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ఇది ఓ హిందీ డబ్బింగ్ సినిమా. ఇందులో ఎన్టీఆర్ ఒక హీరో.

అయితే గేమ్ ఛేంజర్, హరి హర వీర మల్లు పక్కా తెలుగు సినిమాలు. అయినప్పటికీ ఆ సినిమాలతో వార్ 2 ను పోలుస్తూ.. ఫ్యాన్స్ వార్ చేస్తున్నారు. మరోవైపు, ఏపీలో వార్ 2 ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇది తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకర్షించే లాగా లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్పీచ్ తో ఎదురుదెబ్బ తగిలిందని మరికొందరు అంటున్నారు.

మనల్ని ఎవరూ ఆపలేరు. అని ఎన్టీఆర్ చెప్పిన మాటలను ఓ వర్గం అభిమానులు దానిని సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. అందుకే వార్ 2 ని డౌన్ చేయడం, ట్రోల్ చేయడంపై దృష్టి సారించారని తెలుస్తోంది. కారణం ఏమైనప్పటికీ, వార్ 2 సినిమాను ఎన్టీఆర్ చేయకపోతే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి నుంచీ ట్రైలర్ నుండి సినిమా వరకు తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేలా ఏ విషయం లేకపోవడమే ఈ లో రెస్పాన్స్ కు కారణం.

కాగా, ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఇందులో నటించారు. 2019లో రిలీజైన వార్ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.