Begin typing your search above and press return to search.

గుండెపోటుతో ప్రముఖ నటి మృతి... ఐసీయూలో కడుపులో బిడ్డ!

ప్రముఖ మళయాలీ నటి రంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్న షాక్ నుండి సినీ-సీరియల్ పరిశ్రమలు ఇంకా తేరుకోకముందే మరో విషాద ఘటన జరిగింది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:18 PM GMT
గుండెపోటుతో ప్రముఖ నటి మృతి... ఐసీయూలో కడుపులో బిడ్డ!
X

తాజాగా చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి గుండెపోటుతో మరణించారు. మరణించే సమయానికి ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణి కావడం గమనార్హం. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ విషాధ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని కంటినీరు పెట్టించింది! ప్రస్తుతం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ఐసీయూలో ఉంది!

వివరాళ్లోకి వెళ్తే... ప్రముఖ మళయాలీ నటి రంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్న షాక్ నుండి సినీ-సీరియల్ పరిశ్రమలు ఇంకా తేరుకోకముందే మరో విషాద ఘటన జరిగింది. ఇందులో భాగంగా... మళయాలం సీరియల్స్‌ లో యాక్టివ్‌ గా ఉన్న నటి డాక్టర్ ప్రియ కన్నుమూశారు. ఆమె మరణించిన విషయాన్ని బుల్లితెర నటుడు కిషోర్ సత్య తన సోషల్ మీడియా పేజీ ద్వారా తెలియజేశారు!

రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియకు నిన్న (మంగళవారం) హఠాత్తుగా గుండెపోటు వచ్చిందంట. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిందని చెబుతున్నారు. మరణించే సమయానికి ఆమె 8 నెలల గర్భవతి కావడంతో ఈ విషాదం రెట్టింపయ్యింది! దీంతో ఆమె మృతదేహానికి ఆపరేషన్ చేసిన వైద్యులు శిశువును బయటకు తీశారు. ఇంకా పూర్తిగా నెలలు నిండకపోవడంతో ఆ శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కాగా... సరిగ్గా రెండు రోజుల క్రితం సినీ, సీరియల్ నటి రెంజూషా మీనన్ (35) మరణించిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని ఆమె ఫ్లాట్ లో ఉరివేసుకుని విగతజీవిగా వేళాడుతూ ఉంది. ఆమె సీరియల్స్‌ లో లైన్ ప్రొడ్యూసర్‌ గా కూడా పనిచేసింది. దాదాపు 20 సీరియల్స్‌ లో నటించింది! అయితే ఈ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు! ఇలా వరుస మరణాలు సంభవిస్తుండటంతో మళయాలం టీవీ-సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది!

ఈ విషయాలను సోషల్ మీడియాలో వెళ్లడించిన కిషోర్ సత్య... తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఇందులో భాగంగా... "మలయాళ టెలివిజన్ రంగంలో మరో అనూహ్య మరణం. డాక్టర్ ప్రియా నిన్న గుండెపోటుతో మరణించారు. ఆమె 8 నెలల గర్భిణి. ప్రస్తుతం పాప ఐసీయూలో ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. నిన్న రొటీన్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాను. అకస్మాత్తుగా గుండె ఆగిపోయింది" అని తెలిపారు.

ఇదే సమయంలో... "ఒక్కగానొక్క కూతురు మరణాన్ని తట్టుకోలేక ఆమె తల్లి తీవ్రంగా విలపిస్తుంది. 6 నెలలుగా ఎక్కడికీ వెళ్లకుండా ప్రియను కనిపెట్టుకుని ఉన్న భర్త ఈ విషయం తెలిసి కూలబడిపోయారు. రంజుషా మరణవార్త నుండీ ఇంకా తేరుకోకముందే... 35 ఏళ్లు మరో వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టడం దారుణం" అని స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని.. ఆమె తల్లి, భర్తలకు ఆ భగవంతుడే మనోధైర్యం ప్రసాధించాలని.. సోషల్ మీడియా వేదికగా కోరుకున్నాడు!!