Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. తమిళంలో కూడా ఎందుకంటే?

తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు తాజాగా స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   31 March 2024 9:11 AM GMT
ఫ్యామిలీ స్టార్.. తమిళంలో కూడా ఎందుకంటే?
X

విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ మూవీ కావడంతో మరింత క్రేజ్ ఈ చిత్రంపై ఉంది.

తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు తాజాగా స్పష్టం చేశారు. తమిళనాడులో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో మూవీ విశేషాలు పంచుకున్నారు. సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంటుందని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ వాళ్ళు ఇచ్చారని అన్నారు. సినిమాలో నాలుగు ఫైట్స్ ఉంటాయని అందుకే యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని స్పష్టం చేశారు.

ఓవరాల్ గా ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు. తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నామని, రెండు వారల తర్వాత హిందీ, మలయాళంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని అన్నారు. తమిళనాడులో మొత్తం 250 థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకి తమిళనాట మంచి ఆదరణ లభించింది. తెలుగులో కంటే తమిళంలోనే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

దిల్ రాజు వారిసు మూవీతో నిర్మాతగా తమిళ్ ఆడియన్స్ కి చేరువ అయ్యారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు మాటలు తమిళనాట ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ సినిమాకి కోలీవుడ్ లో మంచి ఆదరణ వస్తుందని నమ్ముతున్నారు. కానీ అక్కడి వాళ్ళు మిగతా భాషల నుంచి వాచ్చే వారికి, మన తెలుగు ఆడియెన్స్ ఇచ్చినంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్.

ఒకవేళ ఈ సినిమాని తమిళ్ ఆడియన్స్ ఆదరిస్తే మాత్రం తెలుగు సినిమాల విషయంలో వారి ఆలోచనలు మార్చుకున్నట్లే అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీ హిట్ అయితే అతని మార్కెట్ రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే యాక్షన్ మూవీకి ఈ సినిమా టాక్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాని తమిళ్ ఆడియన్స్ బాగానే ఆదరించారు. అందుకే ఫ్యామిలీ స్టార్ చిత్రంపై రిలీజ్ కి ముందే దిల్ రాజు టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.