Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. పంచె ఎగ్గ‌ట్టి దేనికోసమో?

తెల్ల పంచె ఎగ్గ‌ట్టాడు.. బ్యాక్ ఫీట్‌లో ఫోజిచ్చాడు.. అక్క‌డ గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి.. చూస్తుంటే సీరియ‌స్ మ్యాట‌ర్‌లానే ఉంది

By:  Tupaki Desk   |   3 March 2024 6:05 AM GMT
ఫ్యామిలీ స్టార్.. పంచె ఎగ్గ‌ట్టి దేనికోసమో?
X

తెల్ల పంచె ఎగ్గ‌ట్టాడు.. బ్యాక్ ఫీట్‌లో ఫోజిచ్చాడు.. అక్క‌డ గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి.. చూస్తుంటే సీరియ‌స్ మ్యాట‌ర్‌లానే ఉంది... ఇంత‌కీ ఫ్యామిలీ స్టార్ ఏం చేయ‌బోతున్నాడు? ఇలాంటి ర‌క‌ర‌కాల సందేహాల‌ను మోసుకొచ్చింది ఈ కొత్త పోస్ట‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ది ఫ్యామిలీ స్టార్ టీజ‌ర్ డేట్ ని ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఈ సోమ‌వారం (4 మార్చి) సాయంత్రం 6.30 పీఎం టీజ‌ర్ దూసుకొస్తోందని వెల్ల‌డించారు.

అందుకు సంబంధించిన పోస్ట‌ర్ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. తెలుపు ఎరుపు మిక్స్ డ్ గా లైట‌ర్ క‌ల‌ర్ లో ఉన్న‌ గ‌డుల పంచెలో దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ ట‌చ్ ఇచ్చాడు. కుటుంబ భారం మోసేవాడిలానే క‌నిపిస్తున్నాడు కానీ.. ఇంకా ఏదో తేడా కొడుతోంది! త‌న‌దైన ట్రేడ్ మార్క్ ఫోజ్ తో దేవ‌ర‌కొండ క్యూరియాసిటీ పెంచాడు. చూస్తుంటే ప‌ర‌శురామ్ గీత గోవిందంకి సీక్వెల్ తీస్తున్నాడేమో అనే సందేహం క‌లుగుతోంది. కానీ ఇది వేరే క‌థ అని కూడా చెబుతున్నారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్ ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్.. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్, సంగీతం : గోపీసుందర్, ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్.