Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్… అట్లుంటది మరి రాజుగారి బిజినెస్..

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో మూడు చిత్రాలకి దిల్ రాజు డిస్టిబ్యూటర్

By:  Tupaki Desk   |   3 Feb 2024 2:30 PM GMT
ఫ్యామిలీ స్టార్… అట్లుంటది మరి రాజుగారి బిజినెస్..
X

టాలీవుడ్ బడా నిర్మాతగా తిరుగులేని స్థాయిలో ఉన్న దిల్ రాజు మరో వైపు డిస్టిబ్యూటర్ గా కూడా భారీ సక్సెస్ లు అందుకుంటున్నాడు. గత ఏడాది జైలర్ మూవీ దిల్ రాజు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో మూడు చిత్రాలకి దిల్ రాజు డిస్టిబ్యూటర్. గుంటూరు కారం ఓ మోస్తరుగా కలెక్షన్స్ తీసుకొస్తే, నా సామిరంగా సాలిడ్ ప్రాఫిట్ ఇచ్చింది. సైంధవ్ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి తన నిర్మాణంలోనే ఒక సినిమాని దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి ఫ్యామిలీ స్టార్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు అనుకున్నారు. కానీ గుంటూరు కారం సినిమాతో పాటు మిగతా సినిమాల బిజినెస్ లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.

అందుకే సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తప్పుకుంది. అయితే ఇప్పుడు దిల్ రాజు కరెక్ట్ టైం చూసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు. లాంగ్ వీకెండ్, సెలవులు కలిసొచ్చే సమయంలో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతూ ఉండటం వలన ఎక్కువ మంది సినిమాని చూడటానికి ఛాన్స్ దొరుకుతుంది. దీని కారణంగా సినిమాకి కూడా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ బట్టి దేవర వాయిదా పడనుందంట. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఏప్రిల్ నాటికి కంప్లీట్ అయ్యే అవకాశం ఉండకపోవడంతో దేవర మూవీ రిలీజ్ వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దిల్ రాజు ఓ మీడియా మీట్ లో దేవర మూవీ వాయిదా పడితే ఆ డేట్ కి మా ఫ్యామిలీ స్టార్ వస్తుందని చెప్పాడు.

తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 4గా ఎనౌన్స్ చేశారు. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గీతాగోవిందం పెద్ద హిట్ అయ్యింది. మరోసారి అదే కాంబో కావడంతో ఫ్యామిలీ స్టార్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ చూసిన తర్వాత దిల్ రాజుకి తెలిసినంత బిజినెస్ లెక్కలు స్ట్రాటజీ ఎవరికీ ఇండస్ట్రీలు లేవని చెప్పుకుంటున్నారు.