Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ సాంగ్.. సర్ ప్రైజ్ ఏమిటంటే..

ఇక సినిమాకు సంబంధించిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి.

By:  Tupaki Desk   |   11 March 2024 12:33 PM GMT
ఫ్యామిలీ స్టార్ సాంగ్.. సర్ ప్రైజ్ ఏమిటంటే..
X

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురాం కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వివిధ రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇప్పుడు అయితే ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా విడుదల చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి.

ప్రమోషన్స్ హడావుడి మొదలుపెట్టిన మేకర్స్ మొదటగా సాంగ్స్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక లవ్లీ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ సాంగ్ కళ్యాణి వచ్చావచ్చా అనే పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఈ సెకండ్ సాంగ్ ను మార్చి 12వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమాలో రష్మిక మందన్న ఒక స్పెషల్ గెస్ట్ గా కొంతసేపు కనిపించబోతున్నట్లుగా ఇదివరకే టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఆమె ఈ పాటలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు సమాచారం. విజయ్ మృణాల్ ఇద్దరి మధ్యలో స్టెప్పులు వేస్తూ అలరించనుందట. ఈ వెడ్డింగ్ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ ఇద్దరు కూడా పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. చూస్తూ ఉంటే సినిమాలో వీరి కెమిస్ట్రీ చాలా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో ఆ తరువాత మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఏప్రిల్ 5కి రావాల్సిన దేవర వాయిదా పడటం వల్ల వారి ఫోకస్ ఆ డేట్ పై పడింది. లాంగ్ వీకెండ్ లో సమ్మర్ హాలిడేస్ కావడం వలన సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్యామిలీ స్టార్ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.