Begin typing your search above and press return to search.

సంక్రాంతి టార్గెట్ కోసం ఫ్యామిలీ స్టార్ తిప్పలు

దిల్ రాజు ప్రొడక్షన్లో పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2023 9:36 AM GMT
సంక్రాంతి టార్గెట్ కోసం ఫ్యామిలీ స్టార్ తిప్పలు
X

2024 సంక్రాంతికి ఎలాగైన సినిమాను విడుదల చేయాలని కొందరు హీరోలు చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. పోటీ ఎంత ఉన్నా కూడా మహేష్ బాబు గుంటూరు కారం భారీగా విడుదలవుతున్న కూడా అసలు ఏ మాత్రం వెనకడుగు వేయడానికి ఇష్టపడడం లేదు. ఇక ఈ లిస్టులో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్లో పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అసలైతే ఈ సినిమాను సంక్రాంతి తర్వాత విడుదల చేయాలని అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఫెస్టివల్ను టార్గెట్ చేసుకొని మంచి కలెక్షన్స్ అందుకోవాలని ఆలోచనతో రిస్క్ తీసుకుంటున్నాడు. మిగతా సినిమాల డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పటికీ ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తున్నారు అంటే ఎంతగా ఆలోచించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ చేసుకోవడంతో దర్శకుడు పరుశురామ్ అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక విజయ్ కూడా మరోవైపు గౌతం చిన్న నూరి సినిమాను కాస్త హోల్డ్ లో పెట్టి మరి ఈ సినిమాకే టైం ఎక్కువగా కేటాయిస్తున్నాడు. అయితే ఒక కీలకమైన షెడ్యూల్ను అమెరికాలో చేయాలని అనుకున్నారు.

కానీ వీసా సమస్య కారణంగా ఆ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. దీంతో టైం వేస్ట్ చేయకూడదు అని ఇప్పుడు మళ్ళీ కథలో కొన్ని చిన్న మార్పులు చేసి ఈ ఎపిసోడ్ ను బ్యాంకాక్ బ్యాంక్ డ్రాప్ లో షూట్ చేయాలని అనుకుంటున్నారు. లేదంటే అది కూడా కుదరకపోతే యూకే వైపు యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా షూటింగ్ను నవంబర్ మిడ్ లోపే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. దర్శకుడు పరుశురాం పక్క ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ను కొనసాగిస్తున్నారు. దిల్ రాజు కూడా ఖర్చు కోసం ఆలోచించకుండా సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంక్రాంతి ఫెస్టివల్ కు వచ్చే సినిమా కాబట్టి ఏ మాత్రం క్లిక్ అయినా కాసుల వర్షం కురుస్తుంది. అందుకే స్పీడ్ గా పనులన్నీ ఫినిష్ చేసుకొని ప్రమోషన్స్ కి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.