Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. మొత్తానికి ఆ డేట్ దొరికేసింది

ఇటీవల దిల్ రాజు మాటలతో ఆ డేట్ కు వస్తుందని అర్థమయిపోయింది. దేవర సినిమా ఏప్రిల్ 5వ తేదీన రావాలని అనుకుంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 12:15 PM GMT
ఫ్యామిలీ స్టార్.. మొత్తానికి ఆ డేట్ దొరికేసింది
X

విజయ్ దేవరకొండ పరుశురామ్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా గీతగోవిందం బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక మళ్ళీ ఇంతకాలం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో వీరు చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాపై పాజిటివ్ బజ్ అయితే కనిపిస్తోంది.

అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం అలాగే షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక సినిమాను మార్చిలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ లోనే దేవర మొదట అనుకున్న డేట్ ను ఫ్యామిలీ స్టార్ టార్గెట్ చేసింది. ఇటీవల దిల్ రాజు మాటలతో ఆ డేట్ కు వస్తుందని అర్థమయిపోయింది. దేవర సినిమా ఏప్రిల్ 5వ తేదీన రావాలని అనుకుంది. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో డేట్ మార్చుకునే పనిలో పడింది.

ఇక దేవర ఉండదు కాబట్టి ఏప్రిల్ 5 పర్ఫెక్ట్ డేట్ అని దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ సినిమాను అప్పుడే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలి అని ఫిక్స్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా సినిమా ఏప్రిల్ 5వ తేదీన రాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ అఫీషియల్ క్లారిటీతో దేవర ఆ ఆ టైంకి రాకపోవచ్చు అని మరొక క్లారిటీ వచ్చేసింది.

మొత్తానికి ఎలాంటి బిగ్ క్లాష్ లేకుండా సోలోగా డేట్ లభించడంతో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక అదే టైంలో మరొక రెండు మీడియం రేంజ్ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ అవుతుంది. ఇక వీలైనంత త్వరగా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.