Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. అనౌన్స్‌మెంటే తరువాయి

హడావుడి పడితే క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. అసలే తీవ్రమైన పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేయాలి. అటు ఇటు అయితే సినిమా అన్యాయం అయిపోతుంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:33 PM GMT
ఫ్యామిలీ స్టార్.. అనౌన్స్‌మెంటే తరువాయి
X

వచ్చే సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా నెలకొన్న విపరీతమైన పోటీ గురించి కొంత కాలంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఏకంగా అరడజను సినిమాలు షెడ్యూల్ అయ్యాయి 2023 సంక్రాంతికి. అందులో ఏ సినిమా టీం కూడా తగ్గేదేలే అన్నట్లే వ్యవహరించింది. కొంచెం లేటుగా రేసులోకి వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా కూడా సంక్రాంతికి రావడం పక్కా అన్నట్లే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ టీం వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమై.. సంక్రాంతి డెడ్ లైన్‌ను అందుకోవడం అసాధ్యమని 'ఫ్యామిలీ స్టార్' టీం ఒక నిర్ణయానికి వచ్చేసిందట. ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. వేసవికి వాయిదా వేయాలని నిర్మాత దిల్ రాజు ఫిక్సయిపోయారట. ఇక ఈ విషయమై అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి అంటున్నారు.

'ఫ్యామిలీ స్టార్'కు సంబంధించి ఒక కీలక షెడ్యూల్ ఫారిన్లో చేయాల్సి ఉంది. అందుకోసం ముందు అమెరికా అనుకున్నారు. తర్వాత బ్యాంకాక్ అని ప్రచారం జరిగింది. చివరికి అమెరికాకే వెళ్లాలనుకున్నారు. ఐతే వీసా, ఇంకేవో సమస్యల వల్ల ఈ షెడ్యూల్ అనుకున్న ప్రకారం మొదలు కాలేదు. ఆల్రెడీ టైట్ షెడ్యూల్స్‌లో పని జరుగుతుండగా.. కొన్ని రోజులు వృథా అయినా ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది. ఈ షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల టార్గెట్ అందుకోవడం కష్టమని అర్థం చేసుకుందట టీం.

హడావుడి పడితే క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. అసలే తీవ్రమైన పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేయాలి. అటు ఇటు అయితే సినిమా అన్యాయం అయిపోతుంది. దిల్ రాజు‌కు ఎన్ని థియేటర్లు ఉన్నప్పటికీ సంక్రాంతి పోటీ మధ్య సినిమాకు లిమిటెడ్ రిలీజే దక్కుతుంది. అందుకే అన్నీ ఆలోచించుకుని తమ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. వేసవి ఆరంభంలో విడుదల చేయాలని దిల్ రాజు అండ్ కో డిసైడైపోయిందట. మిగతా సంక్రాంతి చిత్రాలకు, అలాగే అభిమానులకు ఈ క్లారిటీ ఇవ్వడం కోసం కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.