Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్.. రష్మికకు లింకేంటి?

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం వల్ల ఫ్యామిలీ స్టార్ మేకర్స్.. జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 1:22 PM GMT
ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్.. రష్మికకు లింకేంటి?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్.. లీడ్ రోల్స్ లో నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మూడు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం వల్ల ఫ్యామిలీ స్టార్ మేకర్స్.. జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న విజయ్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల విజయ్.. సీరియల్ నటీమణులు కమ్ ఫేమస్ యూట్యూబర్లతో ఫన్నీ చిట్ చాట్ నిర్వహించారు. షూటింగ్ స్పాట్ లోనే వారందరితో ముచ్చటించారు.

అయితే హీరోయిన్ రష్మికతో విజయ్ సీక్రెట్ లవ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వారిద్దరిలో ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు రష్మిక బర్త్ డే రోజే.. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో యూట్యూబర్స్ కమ్ సీరియల్ యాక్టర్స్ చిట్ చాట్ లో.. "ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కదా.. ఆ రోజు ఏమైనా స్పెషల్ ఉందా" అని ఓ నటి అడిగారు.

వెంటనే విజయ్ చాలా హాలీడేస్ ఉన్నాయని చెప్పగా అంతా నవ్వారు. "ఇంకేదో కోఇన్సిడెన్స్ ఉంది.. అదే రష్మిక బర్త్‌ డే అనుకుంటా" అని అడిగారు. "అవును రష్మిక బర్త్‌ డే నే. అది మాకు (మూవీ టీమ్ కు) లక్కీ అవుతుందని అనుకుంటున్నా" అని విజయ్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్, రష్మికకు సంబంధించిన అనేక రకాల ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో రష్మిక.. ఓ సాంగ్ లో కనిపిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ లో నేషనల్ క్రష్ కనిపించనుందట. ఈ విషయాన్ని కావాలనే చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచిందని తెలుస్తోంది. ఇక గోపీ సుందర్ మ్యూజిక్ అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‍ రాజు, శిరీష్ సినిమాను నిర్మించారు. ఉగాది ఫెస్టివల్ కు నాలుగు రోజులు ముందు రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి మరి.