Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. ఓటీటీ సౌండ్ ఎలా ఉందంటే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 April 2024 8:25 AM GMT
ఫ్యామిలీ స్టార్.. ఓటీటీ సౌండ్ ఎలా ఉందంటే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఫ్యామిలీ స్టార్ గా అద్భుతమైన నటనతో మెప్పించాడు. మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇక సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని మేకర్స్ విడుదలైనప్పుడే ప్రత్యేకంగా తెలియజేశారు. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ ఆడియన్స్ ను డైరెక్ట్ గా కలిసి సినిమా రెస్పాన్స్ గురించి తెలుసుకున్నారు. ఇక ఈ సినిమా పై కావాలని కొంతమంది నెగటివ్ ప్రచారాలు చేశారు అని కూడా ఆయన తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ గా దర్శనం ఇచ్చిన ఫ్యామిలీ స్టార్ ఇప్పటికీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. ఇక దానికి సంబంధించిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమాలో విజయ్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది అని అలాగే లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అని మరికొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో కళ్యాణి వచ్చావచ్చా సాంగ్ కూడా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ పాటను ప్రమోట్ చేసిన విధానం కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో కూడా ఓ వర్గం ఆడియన్స్ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అని చెప్పవచ్చు.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా అతను చేసిన ప్రయోగం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమాను అమెజాన్ లో ఎంతో ఆసక్తిగా చూస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ రౌడీ స్టార్ దిల్ రాజుతోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అది కూడా పొలిటికల్ టచ్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లోనే దిల్ రాజు విజయ్ తో చేయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. మరో రెండు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. మరి విజయ్ రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.