Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్‌ : ఫస్ట్‌ డే ఊహించని ట్విస్ట్‌

విజయ్ దేవరకొండ, పరశురామ్‌ కాంబోలో గీత గోవిందం వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   6 April 2024 9:36 AM GMT
ఫ్యామిలీ స్టార్‌ : ఫస్ట్‌ డే ఊహించని ట్విస్ట్‌
X

విజయ్ దేవరకొండ, పరశురామ్‌ కాంబోలో గీత గోవిందం వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హిట్‌ కాంబో ను రిపీట్ చేస్తూ దిల్‌ రాజు ఫ్యామిలీ స్టార్‌ ను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మృణాల్‌ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ ల ఫ్యామిలీ స్టార్‌ మూవీ కి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా పై మొదటి నుంచి కూడా పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యేలా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తూ వచ్చారు.

సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆటతోనే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. దాంతో ఇది వసూళ్ల విషయంలో దిల్‌ రాజుకు షాక్ ఇవ్వడం ఖాయం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

టాక్ తో సంబంధం లేకుండా సమ్మర్ హాలీడేస్ కలిసి వచ్చి ఫ్యామిలీ స్టార్‌ కి మొదటి రోజు డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు వసూళ్ల విషయంలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. అయితే లాంగ్‌ రన్‌ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం డౌటే.