Begin typing your search above and press return to search.

ఆ విషయము పై ఫ్యామిలీ స్టార్‌ ప్రత్యేక శ్రద్ద!

ఫ్యామిలీ స్టార్ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో దిల్‌ రాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రమోషన్ ప్లానింగ్‌ చేయాలని భావిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 10:32 AM GMT
ఆ విషయము పై ఫ్యామిలీ స్టార్‌ ప్రత్యేక శ్రద్ద!
X

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. దేవర సినిమా కోసం లాక్ చేసిన ఏప్రిల్‌ 5ను ఫ్యామిలీ స్టార్ సినిమా కి కన్ఫర్మ్‌ చేయడం జరిగింది.

ఫ్యామిలీ స్టార్ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో దిల్‌ రాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రమోషన్ ప్లానింగ్‌ చేయాలని భావిస్తున్నాడు. కాస్త అటు ఇటుగా అయిదు వారాలు మాత్రమే విడుదలకు సమయం ఉంది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరో వారం లేదా పది రోజుల్లోనే షూటింగ్‌ ను ముగించాలని యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారట.

ఎక్కువ రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సినిమాను జనాల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లవచ్చు అనేది యూనిట్‌ సభ్యుల అభిప్రాయం. అందుకే దర్శకుడు పరశురామ్ సినిమా షూటింగ్‌ ను ముగించేందుకు స్పీడ్ గా షూట్‌ చేస్తున్నాడు.

మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాల ప్లానింగ్‌ కోసం దిల్ రాజు టీం వర్క్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోటీ పెద్దగా లేకున్నా కూడా లైట్ తీసుకోకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని భావిస్తున్నారట.