Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. మెయిన్ టార్గెట్ వాళ్ళే!

అందుకే ప్రమోషన్స్, పబ్లిసిటీ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు.

By:  Tupaki Desk   |   2 April 2024 12:30 PM GMT
ఫ్యామిలీ స్టార్.. మెయిన్ టార్గెట్ వాళ్ళే!
X

ఎంత కష్టపడి తీసిన సినిమా అయినా సరే, సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లకపోతే ఆశించిన ఫలితం దక్కదు. ఎలాంటి సినిమా తీశాం, ఎటువంటి కంటెంట్ తో రాబోతున్నాం అనేది ప్రమోషనల్ మెటీరియల్ ద్వారానే తెలియజెప్పి.. ప్రేక్షకులని ముందే ప్రిపేర్ చేయాల్సిన అవసరం వుంది. టీజర్ - ట్రైలర్ లో ఒక విధమైన కంటెంట్ చూపించి, చివరకు సినిమాలో వేరే కంటెంట్ ను చూపిస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే ప్రమోషన్స్, పబ్లిసిటీ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' మేకర్స్ కూడా ప్రచార కార్యక్రమాల్లోనే తమ సినిమా ఏంటనేది ఆడియెన్స్ కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ దర్శకకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ మూవీ, కాస్త ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతోంది. 'దేవర-1' వాయిదా పడటంతో, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. సమ్మర్ లాంటి మంచి సీజన్ దొరకడంతో, విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో ఈ సినిమా సంగతులను పంచుకున్నారు.

"ఫ్యామిలీతో పాటుగా యూత్ అంతా చూసిన సినిమా 'బొమ్మ‌రిల్లు'. 'శతమానం భవతి' చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూశారు.. యూత్ కొంచం తక్కువ చూశారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్ బాబు ఉండటం వల్ల యూత్ కూడా చూశారు. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టోరీ' సినిమాలో లవ్ స్టోరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 30 పర్సెంట్ ఫ్యామిలీ స్టోరీ ఉంటే, 70 పర్సెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇది యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీ మీద నడిచే ఫ్యామిలీ స్టోరీ. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే సినిమా" అని దిల్ రాజు అన్నారు.

"సినిమా రిలీజ్ అయినప్పుడు వివిధ రకాల స్పందనలు వస్తుంటాయి. కానీ చివరకు అది ఇచ్చే బాక్సాఫీస్ రిజల్ట్ ఇంపార్టెంట్. ఏ సినిమా కూడా వందకు వంద శాతం ప్రేక్షకులకు నచ్చదు. అలా నచ్చితే అది ఎక్కడికో వెళ్తుంది. కానీ అందులో లోపాలు వెతికేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మాకు 100 మంది ప్రేక్షకుల్లో 75 మంది సినిమా నచ్చిందని చెప్పినా మేము ఫస్ట్ క్లాస్ లో పాసైనట్లు భావిస్తాను. డెఫినెట్ గా 'ఫ్యామిలీ స్టార్' ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా." అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

‘ఫ్యామిలీ స్టార్‌’ టైటిల్ చూసి ఇది కేవలం కుటుంబ కథా చిత్రమని భావించి, యూత్ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యే అవకాశం వుంది. అందుకే దిల్ రాజు మూవీ ప్ర‌మోష‌న్ల‌లో ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు, మెజారిటీ భాగం యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీ అని కాస్త గ‌ట్టిగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలానే ఇటీవల ఓ సందర్భంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని చెప్పారు.

దిల్ రాజు స్టేట్మెంట్స్ ను బట్టి చూస్తే.. ఫ్యామిలీతో పాటు యూత్ ను థియేటర్లకు రప్పించి, 'బొమ్మరిల్లు' తరహాలోనే 'ఫ్యామిలీ స్టార్' ను పెద్ద హిట్ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ‘శ‌త‌మానం భ‌వతి’ సినిమాకు దూరమైన యంగ్‌ స్ట‌ర్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉండ‌డం ఈసారి బాగా కలిసొచ్చే విషయం. దిల్ రాజు సినిమా అంటే ఎలాగూ కుటుంబ ప్రేక్షకులు వస్తారు కాబట్టి, మిగిలిన వర్గాల వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో ఇది అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో తీసిన సినిమా అని చెప్పకనే చెప్పారు. మరి ఈ 'ఫ్యామిలీ స్టార్' ఫ్యామిలీ ప్లస్ యూత్ ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.