Begin typing your search above and press return to search.

మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్లి అంత రిచ్ గానా?

హీరోహీరోయిన్లలిద్దరూ ట్రెడిషనల్ గెటప్స్ లో అదరగొట్టారు. చూడముచ్చటగా కనిపిస్తూ డ్యాన్స్ తో ఫిదా చేశారు.

By:  Tupaki Desk   |   13 March 2024 10:51 AM GMT
మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్లి అంత రిచ్ గానా?
X

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుందీ చిత్రం.

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న మూవీ తర్వాత ఫ్యామిలీ స్టార్ తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, లిరికల్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నందనందనా సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంటోంది. దీంతో మేకర్స్ ఈ సినిమా.. మంచి హిట్ అవుద్దనే నమ్మకంతో ఉన్నారు. ఆ జోష్ తోనే ఇటీవల కళ్యాణి వచ్చా పాటను రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్- మృణాల్ పెళ్లి టైం లో వచ్చే సాంగ్ గా కళ్యాణి వచ్చా వచ్చా పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరోహీరోయిన్లలిద్దరూ ట్రెడిషనల్ గెటప్స్ లో అదరగొట్టారు. చూడముచ్చటగా కనిపిస్తూ డ్యాన్స్ తో ఫిదా చేశారు. గోపీసుందర్ మంచి ట్యూన్ అందించగా.. మంగ్లీ, కార్తీక్ తమ గొంతుతో ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ సాంగ్ లో లాజిక్స్ వెతికి మూవీ యూనిట్ ను ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఫ్యామిలీ స్టార్ లో హీరో క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించింది అని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక సాంగ్ లో పెళ్లి మండపం తో పాటు వారి డ్రెస్ లు చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. దీంతో ఒక మిడిల్ క్లాస్ యువకుడు.. అంత గ్రాండ్ గా ఎలా పెళ్లి చేసుకున్నాడని ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఫ్యాన్స్.. అది డ్రీమ్ సాంగ్ అయ్యి ఉండొచ్చని సమాధానమిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎవరైనా.. కలలో డ్యూయెట్ సాంగ్స్ వేసుకుంటారని, పెళ్లి పాటలు కాదని బదులిస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ లో విజయ్ దేవరకొండ దోశలు వేస్తారు. పెనం మీద నుంచి దోశ తీసి.. అక్కడే ఉన్న అభినయ తినేందుకు ఆమె ప్లేట్ లో వేస్తారు. అయితే స్లో మోషన్ లో ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసి.. అది దోశ కాదని పేపర్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఆ పోస్ట్ కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించి.. కాస్త ఓపిక పట్టమని కామెంట్ పెట్టింది. ఇలా నెట్టింట ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించిన అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. మరి మూవీ రిలీజ్ అయ్యాక అయినా అవి ఆగుతాయో లేదో చూడాలి.