Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. ఫెస్టివల్ కు గట్టిగానే..

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా పై విడుదలకు వరదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి

By:  Tupaki Desk   |   10 April 2024 5:30 AM GMT
ఫ్యామిలీ స్టార్.. ఫెస్టివల్ కు గట్టిగానే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి దిల్ రాజు నిర్మాణంలో చేసిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన గీత గోవిందం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా పై విడుదలకు వరదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ చేసిన విధానం కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుంది అని దీమా వ్యక్తం చేశారు. ఇక కాస్త టాక్ ఎలా ఉన్నా కూడా చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో కనిపిస్తోంది. ఇక సినిమా వద్ద బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఇప్పుడు గట్టిగానే వస్తున్నట్లు చెబుతున్నారు.

సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో శని ఆదివారాలు అలాగే సోమవారం కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయినప్పటికీ మళ్లీ ఉగాది పండుగ రోజు ఒక్కసారిగా పుంజుకోవడం విశేషం. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక సినిమాకు ఈ వీకెండ్ కూడా ఒక మంచి ఛాన్స్ ఉందనే చెప్పాలి. ముందుగా రంజాన్ పండుగ రాబోతోంది.

కాబట్టి ఆ రోజు కూడా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక తర్వాత వీకెండ్ కూడా మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా కలెక్షన్స్ ఈ వారం కాస్త గట్టిగానే రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫ్రెష్ లవ్ స్టోరీని కూడా దర్శకుడు హైలెట్ చేసిన ప్రయత్నం ఓ వర్గం వారిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరోయిన్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరోసారి తన నటనతో ఎంతగానో మెప్పించింది అనేలా ప్రశంసలు అందుకుంటుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ స్టార్ ఇప్పుడిప్పుడే మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ వారం రంజాన్ పండుగ రోజు కూడా సినిమా మంచి కలెక్షన్స్ అందుకోగలిగితే మరుసటి వారం పై కూడా కాస్త హోప్స్ పెరిగే అవకాశం ఉంది. మరి మొత్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.