Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. పండగ రోజు బాక్సాఫీస్ ఎలా ఉందంటే..

విడుదలకు ముందే కొన్ని పోస్టర్లు అలాగే సాంగ్స్ టీజర్ ట్రైలర్ తో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   9 April 2024 10:30 AM GMT
ఫ్యామిలీ స్టార్.. పండగ రోజు బాక్సాఫీస్ ఎలా ఉందంటే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించగా గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. ఇక మేకర్స్ సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ పాజిటివ్ ప్రమోషన్స్ తో సినిమాను విడుదల చేసింది. విడుదలకు ముందే కొన్ని పోస్టర్లు అలాగే సాంగ్స్ టీజర్ ట్రైలర్ తో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు.

తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని దిల్ రాజు కూడా ఎంతో దిమా వ్యక్తం చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత టాక్ ఎలా ఉన్నా కూడా నిర్మాత మాత్రం ఈ సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది అని ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజేశారు. అంతేకాకుండా థియేటర్స్ వద్దకు వెళ్లి నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ ఆడియన్స్ రియాక్షన్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

గతంలో ఎప్పుడు లేనంత హడావుడిగా దిల్ రాజు ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమాకు కావాలని నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే పండగ రోజు మరింత పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది రోజు సెలవు కావడంతో చాలా ఏరియాలలో ఫ్యామిలీ ఒడియన్స్ తో ఈ సినిమా థియేటర్స్ నిండుగా కనిపించాయి.

బాక్సాఫీస్ వద్ద నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ స్థాయి లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉగాదితో పాటు ఈ వారం మొత్తంలో కూడా ఫ్యామిలీ స్టార్ మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ రంజాన్ సెలవు కూడా ఉండడంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవుతుంది అని మేకర్స్ ధీమాతో కనిపిస్తున్నారు.

ఆ తర్వాత వీకెండ్ కూడా ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. పోటీగా కూడా పెద్దగా సినిమాలు ఏమి లేవు కాబట్టి అన్ని రకాలుగా ఫ్యామిలీ స్టార్ కు కలిసొచ్చే అంశమే. ఫ్యామిలీ స్టార్ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఆయన గీత గోవిందంతో విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో మృణాల్ తో పాటు దివ్యాంశా కౌశిక్, అజయ్ ఘోష్, వాసుకి కీలక పాత్రల్లో నటించారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో విజయ్ కు ఇది మొదటి సినిమా. భవిష్యత్తు లో కూడా విజయ్ తో మరో రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.