Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ బిగ్ గేమ్.. ఇది మూడోది!

ఈ మధ్యలో మూడు పెద్ద డిజాస్టర్ లు వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ అయితే విజయ్ దేవరకొండ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది.

By:  Tupaki Desk   |   3 April 2024 4:00 AM GMT
విజయ్ దేవరకొండ బిగ్ గేమ్.. ఇది మూడోది!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లోకి వస్తోన్న ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. దిల్ రాజు మూవీ అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే తెలుగుతో పాటు మరో మూడు భాషలలో రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండకి కోలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ఉంది. దీంతో కచ్చితంగా తమిళనాట కూడా ఫ్యామిలీ స్టార్ ప్రజాధారణ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ పడి ఐదేళ్లు అవుతోంది.

ఈ మధ్యలో మూడు పెద్ద డిజాస్టర్ లు వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ అయితే విజయ్ దేవరకొండ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేసిందో విజయ్ చాలా సార్లు గుర్తు చేసుకున్నాడు. అందుకే నెక్స్ట్ పూరితో జనగణమన స్టార్ట్ చేసి మరి వదిలేసాడు. పరశురామ్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ మళ్ళీ తనని బౌన్స్ బ్యాక్ చేస్తుందని విజయ్ బలంగా నమ్ముతున్నారు.

అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగానే ఉంది. ఫ్యామిలీ స్టార్ మూవీ థీయాట్రికల్ బిజినెస్ 45 కోట్ల వరకు జరిగింది. ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించాలంటే కచ్చితంగా సూపర్ హిట్ టాక్ రావాల్సిందే. విజయ్ దేవరకొండ కెరియర్ హైయెస్ట్ బిజినెస్ జరిగింది లైగర్ మీద. తన మార్కెట్ కి మించి 90 కోట్ల వ్యాపారం ఆ సినిమాపై జరిగిన బయ్యర్లని దారుణంగా తెబ్బతీసింది.

తరువాత వచ్చిన ఖుషి 50 కోట్ల బిజినెస్ చేసింది. ఇది కూడా ఐదు భాషలలో రిలీజ్ అయ్యింది. తమిళంలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంది. తెలుగులో బ్రేక్ ఈవెన్ దగ్గరకి వచ్చి ఆగిపోయింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన లాంగ్ రన్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి ఖుషి మూవీ రప్పించలేకపోయింది. ఈ సారి ఫ్యామిలీ స్టార్ తో విజయ్ మరో బిగ్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ గేమ్ లో అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.