Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. అందులోనే అసలు తేడా!!

సినిమాలోని సీన్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం చిరాకు తెప్పిస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 April 2024 11:33 AM GMT
ఫ్యామిలీ స్టార్.. అందులోనే అసలు తేడా!!
X

ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కు తెలుగులో ఎలాంటి ఫ్యాన్స్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన బాణీలు కట్టిన పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిన్ను కోరి, మజిలీ, గీత గోవిందం చిత్రాలకు గోపీ సుందర్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ మర్చిపోలేం. అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ఆయనే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

గోపీ సుందర్ పేరు.. మూవీ టీమ్ లో ఉంటే చాలు. సాంగ్స్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోతారు. కానీ ఫ్యామిలీ స్టార్ విషయంలో అలా జరగలేదు. ఎప్పుడూ లేనంతగా విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. సినిమా నుంచి మొదట నంద నందనా సాంగ్ రాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఏకంగా 24 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇక రెండో సాంగ్ కల్యాణీ వచ్చా వచ్చా రిలీజ్ అవ్వగా.. ఒక్కడు సినిమాలోని అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా ట్యూన్ కాపీ అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. ఆ తర్వాత మధురము కదా అంటూ సాగిన పాట.. దిల్ సే సినిమాలోని జియా జలే సాంగ్ కాపీలా ఉందని అన్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక గోపీ సుందర్ పై ట్రోల్స్ పెరిగిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు బాలేదని అంటున్నారు నెటిజన్లు.

సినిమాలోని సీన్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం చిరాకు తెప్పిస్తుందని అంటున్నారు. రవి బాబు - హీరో ఫైట్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమాలో చాలా చోట్ల అస్సలు బీజీఎం సింక్ అవ్వలేదని అంటున్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశామని, కానీ మొత్తం రివర్స్ అయిందని పోస్ట్లు పెడుతున్నారు.

ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు.. ఎక్కువ గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో గోపీ సుందర్ తన సినిమా కోసం కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. అయితే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వల్ల గోపీ సుందర్ కెరీర్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పక్కగా ఆయన కేర్ తీసుకోవాల్సిందే.