Begin typing your search above and press return to search.

సిద్ధు, విజయ్ కు భలే ఛాన్స్ దొరికిందిగా!

అందులో ఈసారి ఎన్నికలు కూడా ఉండడంతో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ కూడా అయ్యే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   21 March 2024 5:50 AM GMT
సిద్ధు, విజయ్ కు భలే ఛాన్స్ దొరికిందిగా!
X

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జామ్స్ హడావుడి నడుస్తోంది. విద్యార్థులంతా చదువులో.. పేరెంట్స్ అంతా వారి గురించి కేర్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో అంతా ఫ్రీ అవ్వనున్నారు. కొన్ని రోజుల పాటు షికార్లు, సినిమాలతో హ్యాపీగా గడపనున్నారు. అందుకే వేసవి సెలవుల్లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఏడాది మాత్రం చాలా తక్కువ మూవీలు వస్తున్నాయి.

అందులో ఈసారి ఎన్నికలు కూడా ఉండడంతో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ కూడా అయ్యే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ.. మే9వ తేదీన తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ మే13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఈ సినిమా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే రేపు (మార్చి 22) ఓం భీమ్ బుష్ మూవీ రిలీజ్ కానుంది. యంగ్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమాపై మేకర్స్ మంచి నమ్మకంతో ఉన్నారు. బ్రోచెవారెవరురా కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఇక వచ్చే వారం సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సీక్వెల్ విడుదల కానుంది. మార్చి 29వ తేదీన టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి రానుంది.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫ్యామిలీ స్టార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రానున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఫ్యామిలీ స్టార్ మూవీని పరశురామ్ తెరకెక్కిస్తుండగా.. టిల్లు స్క్వేర్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే ఈ వేసవిలో పెద్ద సినిమాల రిలీజ్ లు లేనట్లే. దీంతో ఈ రెండు మూవీలపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు మూవీ లవర్స్. కాస్త క్లిక్ అయితే చాలు.. కాసుల వర్షం కురుస్తోంది. సెలవులు కనుక.. కచ్చితంగా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ సినిమాలకు సూపర్ ఛాన్స్ దక్కిందని సినీ పండితులు చెబుతున్నారు. వరుస పండుగలు, సెలవులు.. ఈ క్రేజీ అవకాశాన్ని టిల్లు స్క్వేర్ , ఫ్యామిలీ స్టార్ ఎలా యూజ్ చేసుకుంటాయో చూడాలి మరి.