Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ చిరంజీవి చేసి ఉంటే..?

కానీ, తినే బియ్యం గింజ మీద పేరు రాసి ఉన్నట్లు, ఏ ప్రాజెక్టు ఎవరి చేతుల్లోకి వెళ్లాలో కూడా ముందే రాసి పెట్టి ఉంటుందనుకుంట

By:  Tupaki Desk   |   30 Aug 2023 9:20 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ చిరంజీవి చేసి ఉంటే..?
X

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురిచి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మనోజ్ వాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించారు. ఆయన కు భార్యగా ప్రియమణి నటించారు. మొదటి సీజన్ సూపర్ గా క్లిక్ అవ్వడంతో వెంటనే రెండో సీజన్ ని కూడా తెరెక్కించారు. రెండో సీజన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విలన్ రోల్ లో నటించి మెప్పించారు.

అయితే, మొదట ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆఫర్ మెగాస్టార్ చిరంజీవికి వచ్చిందట. కథను కూడా వినిపించారట. కానీ, చిరంజీవి ఈ సిరీస్ చేయడానికి నిరాకరించడంతో, ఈ కథ మనోజ్ వాజ్ పేయి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ సిరీస్ తో మనోజ్ కి బాగా క్రేజ్ పెరిగింది. ఆయనకు మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించడం ఇష్టంలేక కథలో మార్పులు చేయమని చిరు అడిగారట. అది వారికి నచ్చకపోవడంతో సింపుల్ గా చిరు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. కానీ, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా చిరు చేసి ఉంటే మరోలా ఉండేది. కథలో డెప్త్ ఉంది కాబట్టి, కచ్చితంగా చిరు కి మంచి హిట్ పడి ఉండేది. చిరు ఎలాంటి రోల్స్ అయనా ఈజీగా చేయగలడు. అలాంటి ఆయన ఈ రోల్ చేయడం పెద్ద కష్టమేమీ అయ్యేది కాదు, దానికి తోడు సైలెండ్ డైలాగ్స్ తో కామెడీ చేయడం కూడా చిరుకి వెన్నతో పెట్టిన విద్య. దీంతో, ఆయన చక్కగా సెట్ అయ్యేవారు.

సిరీస్ హిట్ అవ్వడంతో పాటు, చిరులోని కొత్త యాంగిల్ ని ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. ఈ రీమేక్ సినిమాలు చేయడానికి బదులు, కొత్త , విభిన్నమైన వెబ్ సిరీస్ లతో ఆయన క్రేజ్, ఫేమ్ బాగా పెరిగిపోయేవి. తన తోటి హీరోలకే కాదు, యంగ్ హీరోలకు కూడా మంచిపోటీ ఇచ్చేవారు.

కానీ, తినే బియ్యం గింజ మీద పేరు రాసి ఉన్నట్లు, ఏ ప్రాజెక్టు ఎవరి చేతుల్లోకి వెళ్లాలో కూడా ముందే రాసి పెట్టి ఉంటుందనుకుంట. అలా, చిరుకి వచ్చిన ప్రాజెక్ట్ మనోజ్ కి చేరింది. చివరకు ఆయన ఆ వెబ్ సిరీస్ తో ఎక్కడలేని స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. వెబ్ సిరీస్ లకు ఆయన ఒక మంచి ఆప్షన్ గా మారిపోయారు.