ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్.. ఎన్ని ఎపిసోడ్స్ అంటే?
పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మరో కొత్త సీజన్ వస్తోంది. ఇండియన్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్‌సిరీస్‌ల్లో ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన సెన్సేషనల్ హిట్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి.
By: Tupaki Desk | 21 Nov 2025 2:00 AM ISTపాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మరో కొత్త సీజన్ వస్తోంది. ఇండియన్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్‌సిరీస్‌ల్లో ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన సెన్సేషనల్ హిట్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సీజన్లు రాగా అవి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఇప్పుడు మూడో సీజన్ రానుంది.
మొదటి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్
నవంబర్ 21 నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. మొదటి రెండు సీజన్లు మంచి హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మూడో సీజన్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. మరి కొన్ని గంటల్లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 స్ట్రీమింగ్ కు రానుండగా దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రతీ ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలుంటుందని అంటున్నారు. ప్రతీ ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగా, గంట లోపు ఉండే ఛాన్సుందని సమాచారం. ఒక్కో ఎపిసోడ్ ఈ రన్ టైమ్ తో వస్తుందంటే అది కచ్ఛితంగా ఆడియన్స్ కు మంచి ట్రీట్ అనే చెప్పాలి.
మనోజ్ బాజ్‌పాయి టైటిల్ రోల్ లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ లో అతనికి జోడీగా ప్రియమణి నటించారు. సీజన్ 3లో నిమ్రత్ కౌర్ తో పాటూ జైదీప్ అల్లావత్ విలన్ లుగా పరిచయం అవుతుండగా, షరీబ్ హష్‌మీ, ప్రియమణి, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, అశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి రెండు సీజన్లతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఫ్యామిలీ మ్యాన్ కొత్త సిరీస్ ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.
