ఫాఫా,ఎస్.జె.సూర్య ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
మలయాళ క్రేజీ నటుడు ఫహద్ ఫాజిల్ టాలెంటెడ్ యాక్టర్ అని అందరికి తెలిసిందే. ఏ క్యారెక్టర్ కి ఫిక్స్ చేసినా దానికి వన్నె తీసుకురావడంలో ఫహద్ శైలి ప్రత్యేకం.
By: Tupaki Desk | 14 Jun 2025 6:00 AM ISTమలయాళ క్రేజీ నటుడు ఫహద్ ఫాజిల్ టాలెంటెడ్ యాక్టర్ అని అందరికి తెలిసిందే. ఏ క్యారెక్టర్ కి ఫిక్స్ చేసినా దానికి వన్నె తీసుకురావడంలో ఫహద్ శైలి ప్రత్యేకం. ఈ విషయాన్ని `పుష్ప`తో పాటు చాలా సినిమాలు నిరూపించాయి. తెలుగులో క్రేజీ ఆఫర్లని అందించాయి. హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తూ ఫహద్ దక్షిణాది భాషల్లో తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇదే స్థాయిలో క్రేజీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ ఎస్.జె. సూర్య. దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్లని అందించిన ఆయన విలక్షణమైన నటనతో తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
ఇలాంటి టాలెంటెడ్ స్టార్స్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. స్క్రీన్ మోతెక్కిపోదూ. యస్ ఈ క్రేజీ ఆలోచన మలయాళ దర్శకుడు విపిన్ దాస్‌కు వచ్చింది. వెంటనే వీరిద్దరితో కలిసి బైలింగ్వల్ మూవీని తెరపైకి తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు విని ఫాఫా, ఎస్.జె.సూర్య అభిమానులు సర్‌ప్రైజ్ ఫీలయ్యారు. హైలీ టాలెంటెడ్ నటులైన ఫహద్ ఫాజిల్, ఎస్.జె. సూర్య కలిసి నటిస్తూ చూడాలని ఆనందించారు.
ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలని ఆవిరి చేస్తూ దర్శకుడు విపిన్ దాస్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం లేదని స్పష్టం చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా విపిన్ దాస్ త్వరలో ఫహద్ ఫాజిల్‌తో ఓ మూవీ చేయబోతున్నాడని తెలిసింది. అయితే అందులో ఎస్.జె. సూర్య నటించరట. దీంతో కోలీవుడ్, మాలీవుడ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఇద్దరు హైలీ టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి నటాస్టారని, వీరిద్దరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రానుందని వార్తలు మొదలు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్, మలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తేలడంతో అంతా ఇది మాకు బ్యాడ్ న్యూస్ అని ఫీలవుతున్నారట. ఈ రోజుల్లో ప్రేక్షకులు కోరుకునే కాంబినేషన్‌లతో సినిమాలు రావడం లేదని, చెత్త ప్రాజెక్ట్‌లు తెరపైకి వస్తున్నాయని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారట. రానున్న రోజుల్లో అయినా అభిమానుల డిమాండ్ మేరకు ఫాఫా, ఎస్.జె.సూర్య కలిసి నటిస్తారేమో వేచి చూడాల్సిందే.
