ఆ క్యారెక్టర్ పై ఆరు నెలలు వర్క్ చేశా.. అయినా కుదరలేదు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూలీ.
By: Tupaki Desk | 15 July 2025 11:49 AM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం, ఒకరి కోసం రాసుకున్న క్యారెక్టర్లు ఏవోవో కారణాలతో ఇంకొకరు చేయాల్సి రావడం చాలా కామన్ గా జరుగుతుంటాయి. అయితే కొన్ని సార్లు ఈ విషయాలు బయటికొస్తే మరికొన్ని సార్లు బయటకు రాకుండానే ఉంటాయి. ఇప్పుడు అలా ఒకరి కోసం రాసుకున్న క్యారెక్టర్ మరొకరికి వెళ్లిన విషయమొకటి సినిమా రిలీజ్ కు ముందే బయటికొచ్చింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూలీ. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో కూలీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపొందిన కూలీ ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
అంటే రిలీజ్ దగ్గరపడిపోతుంది. రిలీజ్ కు ఇంకా నెల కూడా లేదు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. కూలీలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే రిలీజైన కంటెంట్ ద్వారా వెల్లడైంది. దానికి తోడు రీసెంట్ గా పూజా హెగ్డే చేసిన మోనికా అనే స్పెషల్ సాంగ్ లో కూడా సౌబిన్ కనిపించారు.
అయితే ఇప్పుడు సౌబిన్ క్యారెక్టర్ గురించి లోకేష్ కనగరాజ్ ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు. వాస్తవానికి కూలీలో ఇప్పుడు సౌబిన్ కనిపిస్తున్న పాత్ర మొదట ఫహాద్ ఫాజిల్ కోసం రాసుకున్నానని, ఈ క్యారెక్టర్ కోసం ఫఫాను కలిశానని కూడా లోకేష్ వెల్లడించారు. కానీ ఆయనకున్న కమిట్‌మెంట్స్ వల్ల కూలీ లోని క్యారెక్టర్ చేయడం కుదరలేదని చెప్పారు.
ఆరు నెలలకు పైగా ఆ క్యారెక్టర్ ను డెవలప్ చేసి ఆఖరికి సౌబిన్ షాహిర్ ను ఆ క్యారెక్టర్ లోకి తీసుకున్నట్టు లోకేష్ పేర్కొన్నారు. అయితే కూలీ సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటించకపోయినప్పటికీ గతంలో రజినీతో కలిసి ఫఫా వేట్టయాన్ మూవీలో వర్క్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కూలీలో ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, లాంటి స్టార్లు నటించడంతో కూలీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
