స్టార్ యాక్టర్ క్యాబ్ డ్రైవింగ్ డ్రీమ్స్..!
సౌత్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన ఫహద్ ఫాజిల్ తనకున్న క్యాబ్ డ్రైవింగ్ డ్రీంస్ గురించి వెల్లడించాడు.
By: Tupaki Desk | 25 July 2025 3:07 PM ISTసౌత్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన ఫహద్ ఫాజిల్ తనకున్న క్యాబ్ డ్రైవింగ్ డ్రీంస్ గురించి వెల్లడించాడు. సినిమాల్లో నటించడం ఆపేసిన తర్వాత తాను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలని అనుకుంటున్నా అంటూ షాక్ ఇచ్చాడు ఫహద్ ఫాజిల్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు ఫహద్. బార్సిలోనా అంటే తనకు ఇష్టమైన ప్లేస్ అని.. ఆడియన్స్ తనని ఇక తెర మీద చూడలేకపోతున్నాం అంటే అక్కడ వెళ్లి సెటిల్ అవుతా అంటున్నాడు ఫహద్.
అంతేకాదు అక్కడ క్యాబ్ డ్రైవర్ గా చేస్తానని అంటున్నాడు. ప్రజలను ఒకచోట నుంచి మరోచోటికి చేర్చడానికి అదే వారి గమ్యస్థానానికి చేర్చడానికి తాను ఇష్టపడతానని అన్నాడు ఫహద్. తన దృష్టిలో అది చాలా గొప్ప పని అన్నారు. నాకు డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అది ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్పెయిన్ వెళ్లి అక్కడ బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్ గా చేస్తా అంటున్నాడు ఫహద్ ఫాజిల్.
ఫహద్ ఇప్పుడు చెప్పడం కాదు ఇదివరకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తనకు సినిమాలు కాకుండా డ్రైవర్ గా పనిచేయడం ఇష్టమని అన్నాడు. తన ఈ డ్రీం గురించి భార్య నజ్రియాకు కూడా తెలుసని అన్నాడు ఫహద్.
ఫహద్ ఫాజిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారీశన్ అనే సినిమా చేశాడు. వడివేలుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఫహఫ్. సుదీశ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మారీశన్ ఒక మంచి ఎంటర్టైనర్ సినిమాగా వస్తుంది. నవ్విస్తూనే ఆడియన్స్ ని ఆలోచించేలా చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
ఫహద్ ఫాజిల్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తే సూపర్ బజ్ ఉంటుంది. అతను చేసిన ఆవేశం సినిమా లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అల్రెడీ ఆవేశం తెలుగు రైట్స్ కొనేశారని తెలుస్తుంది. ఐతే ఇప్పటివరకు ఆ సినిమా డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. తెలుగులో ఫహద్ ఫాజిల్ పుష్ప 1, 2 సినిమాల్లో నటించాడు. భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రలో ఫహద్ యాక్టింగ్ ఆడియన్స్ ని అలరించింది.
