భారత్ లో మరో రెండు సెంచరీలు చిరస్మరణీయం!
తాజాగా ఈ జాబితాలో మరో రెండు హాలీవుడ్ చిత్రాలు చేరాయి.
By: Tupaki Desk | 24 July 2025 3:43 PM ISTభారత్ లో హాలీవుడ్ చిత్రాల హవా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మార్కెట్ నుంచి 100 కోట్ల వసూళ్లు సాధించిన ఇంగ్లీష్ సినిమాలెన్నో. 'ది జంగిల్ బుక్', 'అవెంజర్స్: ఎండ్ గేమ్', 'లయన్ కింగ్ ', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7', 'జురాసిక్ వరల్డ్', 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్', 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్', 'అవెంజెర్స్ ఇన్పినిటీ వార్', 'అవతార్ ది వేఆఫ్ వాటర్' లాంటి చిత్రాలెన్నో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను సాధించాయి. తాజాగా ఈ జాబితాలో మరో రెండు హాలీవుడ్ చిత్రాలు చేరాయి.
బ్రాడ్ ఫిట్ నటించిన 'ఎఫ్ 1' ఇండియన్ మార్కెట్ లో జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇండియాలోనే ఇప్పటికే వరకూ 70 కోట్ల మార్క్ దాటింది. తాజాగా 100 కోట్ల వసూళ్ల క్లబ్ లో ఎఫ్ వన్ చేరిపోయింది. హైదరాబాద్ ఐమ్యాక్స్ లోనే 50 వేలకు పైగా టికెట్లు తెగాయి. అంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో ఆదరణ దక్కుతుందో అద్దం పడుతోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3850 కోట్లకుపై గా వసూళ్లను సాధించింది. దీంతో ఏడాది ఇప్పటి వరకూ రిలీజ్ అయిన హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్ల చిత్రాల్లో టాప్10లో స్థానం దక్కించుకుంది.
ఇదే జబితా లో `జురాసిక్ వరల్డ్: రీబర్త్` కూడా చేరిపోయింది. ఈ సినిమా భారత్ లో 100 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా రిలీజ్ అనంతరం `ఎఫ్ వన్` పై కొంత ప్రభావం పడింది. వసూళ్లు కాస్త డౌన్ అయినట్లు కనిపించింది. కానీ కొన్ని రోజులకే `ఎఫ్ వన్` మళ్లీ పుంజుకోవడంతో 100 కోట్ల ను సునాయా సంగా సాధించింది. `జురాసిక్ వరల్డ్: రీబర్త్` జూలై 4న విడుదలైన నాటి నుంచి ఒకే దూకుడు ప్రదర్శి స్తుంది. రివ్యూలు కాస్త నెగిటివ్ గా వచ్చినా? అవెక్కడా సినిమాపై ప్రభావం చూపించలేదు.
ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు జురాసిక్ సినిమా వైపే ఆసక్తి చూపించడంతో ఎఫ్ వన్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మరో హాలీవుడ్ చిత్రం `సూపర్ మ్యాన్ `జులై 12న రిలీజ్ అయింది. ఈ సినిమా డివైడ్ టాక్ తో ఆడుతోంది. అయినా రెండు వారల్లోనే మంచి వసూళ్లను సాధింంచింది. ఇప్పటి వరకూ 55-60 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారంలో మార్వెల్ స్టూడియోస్ నుంచి `ఫెంటాస్టిక్ ఫోర్` రిలీజ్ కు రెడీ అవుతోంది. `ఎఫ్ వన్`- `జురాసిక్` ల దూకుడు ఈ సినిమా రిలీజ్ తో తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే గనుక ఎఫ్ వన్ -జురాసిక్ లు సెంచరీలను దాటి భారీ వసూళ్ల దిశగా వెళ్లే అవకాశం లేకపోలేదు.
