'ఆ నలుగురు'లో మెగా ప్రొడ్యూసర్ లేరా?
గత కొంత కాలంగా `ఆ నలుగురు`అనే వర్డ్ ప్రధానంగా వినిపిస్తూ వస్తోంది. వీళ్లు ఎవరంటే అల్లు అరవింద్,డి.సురేష్‌బాబు, దిల్ రాజు,సునీల్ నారంగ్.
By: Tupaki Desk | 24 May 2025 6:52 PM ISTథియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూనుకోవడానికి కారణం ఆ నలుగురేనా? .. ఆ నలుగురిలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారా? అంటే తాజా పరిణామాలు, ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ రిలీజ్ చేసిన స్టేట్‌మెంట్ అవుననే సమాధానం చెబుతున్నాయి. గత కొంత కాలంగా `ఆ నలుగురు`అనే వర్డ్ ప్రధానంగా వినిపిస్తూ వస్తోంది. వీళ్లు ఎవరంటే అల్లు అరవింద్,డి.సురేష్‌బాబు, దిల్ రాజు,సునీల్ నారంగ్.
వీళ్ళ వల్లే చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని అప్పట్లో చాలా మంది నిర్మాతలు, దర్శకులు బాహాటంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ `ఆ నలుగురు` నుంచి అల్లు అరవింద్ క్రమ క్రమంగా తప్పుకుంటూ వచ్చారు. థియేటర్ లీజింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగాలను పక్కన పెట్టారు. వాటికి కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని థియేటర్లు మాత్రం ఇప్పటికీ ఆయన చేతిలోనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నది మాత్రం ముగ్గురే. దిల్ రాజు, సునీల్ నారంగ్, డి. సురేష్‌బాబు. ఇప్పుడు వీరి చేతుల్లోనే అత్యధికంగా థియేటర్లు ఉన్నాయి. ఈ ముగ్గురు కలిసి ఇటీవలే ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారట. కానీ ఈ ముగ్గురు థియేటర్ల బంద్ సమస్యకు ముందు కారణంగా నిలవలేదనే వాదన వినిపిస్తోంది. థియేటర్ల మూసివేత అన్నది ముందుగా మొదలైంది తూర్పుగోదావరి జిల్లాలో.క్రమ క్రమంగా అది రెండు రాష్ట్రాల్లో పాకిపోయింది.
అయితే దీన్ని ముందుగా అరికట్టే అవకాశం ఉన్నా కానీ దీనికి కొంత మంది మద్దతు ప్రకటించడంతో థియేటర్ల బంద్ అనివార్యంగా మారింది. ఇండస్ట్రీలో ప్రధాన చర్చకు దారితీసింది. అంతే కాకుండా థియేటర్ల బంద్ వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.
ఈ నెల 18న ఎగ్జిబిటర్స్ సమావేశం జరిగింది. ఇందులో జూన్ 1న థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని నిర్వహించిందే దిల్ రాజు అని ఇండస్ట్రీలో హాట్ టాక్ నడుస్తోంది. దీనికి అల్లు అరవింద్ దూరంగా ఉన్నారట. బన్నీవాసు పర్సెంటేజ్ విధానాన్ని వ్యతిరేకించారట. ఆ కారణంగానే అల్లు అరవింద్ తాజా వివాదానికి దూరంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. సునీల్ నారంగ్ కూడా ముందు పర్పంటేజ్ విధానానికి మద్దతు తెలిపి ఆ తరువాత చిన్నగా సైడ్ అయ్యారట.
