సౌత్ డైరెక్టర్లకు సిగ్నల్ పంపిన 'సాహో' బ్యూటీ
సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, మదిరా భేడి లాంటి భామలు నటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 April 2025 10:57 PM ISTసాహో చిత్రంలో శ్రద్ధా కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, మదిరా భేడి లాంటి భామలు నటించిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటు పోలీస్ అధికారి పాత్రలో కనిపించింది ఈవ్ లిన్ శర్మ. వాజీ నగరంలో స్పెషల్ పోలీసాఫీసర్ వింగ్ లో పని చేసే హాటెస్ట్ పోలీస్ అధికారిగా .. నీల్ నితిన్ కొలీగ్ గా కనిపించింది శర్మ గాళ్.
అయితే సిన్సియర్ పోలీస్ అధికారిణిగా యూనిఫాంలో కనిపించిన ఈవ్ లిన్ ఒరిజినల్ గా బోల్డ్ అమ్మాయి. ప్రస్తుతం పెళ్లయి ఒక బిడ్డ తల్లి కూడా. అయినా కానీ తనలో ఎంతమాత్రం వేడి తగ్గలేదు అనేందుకు ఇదిగో ఇక్కడ ఈ ఫోటోనే ప్రూఫ్. నన్ను ఇలా చూస్తే జీవితం తలకిందులే! అనేంతగా కవ్విస్తోంది మరి. వేడి పెంచడం ఈ అమ్మడి రెగ్యులర్ హ్యాబిట్.
సుదీర్ఘ కాలం బాలీవుడ్ లో ఉన్నా ఈవ్ లిన్ పెద్ద స్టార్ కాలేకపోయింది. బాలీవుడ్ లో యే జవానీ హై దివానీ- యారియాన్ లాంటి చిత్రాల్లో నటించిన ఈ భామ స్టార్ గా బిజీ అయిపోతుందని భావించినా ఆశించిన రేంజుకు చేరలేకపోయింది. బాలీవుడ్ లో సరైన గాడ్ ఫాదర్ లేకపోవడంతో ఈవ్ లిన్ కెరీర్ జర్నీ ఆశించినంతగా సాగలేదు. ఆ క్రమంలోనే ఆస్ట్రేలియలో డాక్టర్ వృత్తిలో ఉన్న తుషాన్ ని వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాతా ఈవ్ లిన్ నటనా కెరీర్ మరింత నెమ్మదించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం సిద్ధమవుతోంది. మారిన ట్రెండ్ లో సౌత్ లోను నటించేందుకు ఈ భామ సిద్ధమేనని నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోందట.
తాజాగా ఈవ్ లిన్ స్వయంగా షేర్ చేసిన రెడ్ హాట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఈవ్ లిన్ స్పెషల్ గా కనిపిస్తోంది. ``అమ్మగా మారడానికి ముందు జీవితంలో ఇలా ఉన్నాను. మరపురాని GQ ఇండియా షూట్‌కి తిరిగి వస్తున్నాను - ఎందుకంటే కొన్ని క్షణాలు రెండవ స్పాట్‌లైట్‌కు అర్హమైనవి`` అని తాజా ఫోటోషూట్ కి క్యాప్షన్ ఇచ్చింది.
