Begin typing your search above and press return to search.

40 ఏజ్‌లోను ఇషా గుప్తా స్ట‌న్నింగ్ లుక్

ఇషా గుప్తా షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్‌గా మారింది. అంత‌గా ప్ర‌త్యేక‌త ఏం ఉంది?

By:  Tupaki Desk   |   29 April 2025 6:00 AM IST
40 ఏజ్‌లోను ఇషా గుప్తా స్ట‌న్నింగ్ లుక్
X

అందాల ప్ర‌ద‌ర్శ‌న అనేది ఒక క‌ళ‌.. అందం ఎంత ఉన్నా అందంగా ప్ర‌ద‌ర్శించ‌డం తెలియాలి! ఈ విష‌యంలో ఇషా గుప్తా ఇత‌ర భామ‌ల కంటే, నాలుగు ఆకులు ఎక్కువే తింది. నేటిత‌రం క‌థానాయిక‌ల నుంచి పోటీ ఎంత‌ ఉన్నా కానీ, ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకునేందుకు ఇషాజీ ఈ ఏజ్ లోను ఎంత‌గా పాకులాడుతుందో త‌న ఇన్ స్టా చూస్తే ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రు.

ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ దేవ‌త‌గా పాపుల‌రైన ఇషా గుప్తా అందాల పోటీల జ‌డ్జిగాను గౌర‌వాన్ని అందుకున్నారు. భార‌త‌దేశంలో ప్ర‌తిభావంతులైన మోడ‌ల్స్ ని త‌యారు చేయ‌డంలోను త‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. అందుకే సినీప‌రిశ్ర‌మ‌లోను ఇషా గుప్తాకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అయితే కొంత‌కాలంగా న‌ట‌నా కెరీర్ ప‌రంగా ఇషా గుప్తా స్పీడ్ త‌గ్గింది. చాలా రేర్ గా మాత్ర‌మే తెర‌పై క‌నిపిస్తున్నారు. అయినా త‌న అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌కుండా, వ‌రుస ఫోటోషూట్ల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

ఇషా గుప్తా షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్‌గా మారింది. అంత‌గా ప్ర‌త్యేక‌త ఏం ఉంది? అంటే... ఏజ్ లెస్ బ్యూటీ వ‌య‌సు 40 బార్డ‌ర్ లో ఉన్నా కానీ, త‌న‌లో వేడి ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ఇషా గుప్తా లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్ తో ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తోంది. బాడీ హ‌గ్గింగ్ ఇన్న‌ర్ ని ధ‌రించిన ఇషా బో* లుక్ లో చెల‌రేగిపోయింది.

ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ని యూత్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఒక ఐట‌మ్ నంబ‌ర్ లోను న‌ర్తించి తెలుగు వారికి సుప‌రిచిత‌మై. కానీ తెలుగులో ఈంది ఈ భామ‌. కానీ ఇప్పుడు న‌టిగా అవ‌కాశాలు రాలేదు. హిందీ చిత్ర‌సీమ‌లో హౌస్ ఫుల్ 5 లో న‌టిస్తోంది.