Begin typing your search above and press return to search.

న‌టి వ‌ర్సెస్ నిర్మాత‌.. ఒక‌రినొక‌రు తిట్లు

ఈ గొడ‌వ‌కు కార‌ణం అత‌డు దుర్భాష‌లాడ‌ట‌మేన‌ని, మీటూతో ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డించింది. అత‌డు న‌న్ను తిట్టాడు.. నేను అతడిని తిట్టాను.. టిట్ ఫ‌ర్ ట్యాట్ అని పేర్కొంది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 8:45 AM IST
న‌టి వ‌ర్సెస్ నిర్మాత‌.. ఒక‌రినొక‌రు తిట్లు
X

క‌లిసి సెట్స్ లో ప‌ని చేసేప్పుడు కొన్నిసార్లు పొర‌పాట్లు జ‌ర‌గొచ్చు. ఒక‌రితో ఒక‌రు ఘ‌ర్ష‌ణ ప‌డే ప‌రిస్థితులు ఎదురు కావొచ్చు. దీనికి సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా లేదు. హమ్‌షకల్స్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఈషా గుప్తా - ద‌ర్శ‌కుడు సాజిద్ ఖాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈ గొడ‌వ‌కు కార‌ణం అత‌డు దుర్భాష‌లాడ‌ట‌మేన‌ని, మీటూతో ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డించింది. అత‌డు న‌న్ను తిట్టాడు.. నేను అతడిని తిట్టాను.. టిట్ ఫ‌ర్ ట్యాట్ అని పేర్కొంది. నిర్మాత‌తో గొడ‌వ ప‌డిన త‌ర్వాత తాను ఆల్మోస్ట్ ఆ మూవీ నుంచి వైదొలిగాన‌ని వెల్ల‌డించింది. కానీ చివ‌రికి నిర్మాత సాజిద్ వ‌చ్చి సారీ చెప్పాడు. ఆ త‌ర్వాత అత‌డిని మ‌న్నించి సినిమాలో న‌టించాన‌ని ఈషా గుప్తా వెల్లడించింది. నన్ను ఎవ‌రైనా దుర్భాషలాడటం నాకు ఇష్టం లేదు. మ‌న‌తో జ‌నం ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నామో అలాగే వ్యవహరించాలి. అత‌డు తిట్టాడు. ప్ర‌తిగా నేను కూడా అతడిని దుర్భాషలాడాను! అని ఈషా జీ తెలిపారు.

సెట్‌లో గొడవకు కారణం ఏమిటని ప్ర‌శ్నించ‌గా, కొంతమంది మాట్లాడే ముందు ఆలోచించరు.. వారు చాలా కారణాల వల్ల నిరాశ చెందుతారు. నేను దాని గురించి మాట్లాడదలచుకోలేదు.. ఎందుకంటే నేను ఆ గొడ‌వ‌ నుండి తప్పుకున్నాను.. అని తెలిపింది. సాజిద్ పై మీటూలో ఆరోపించారా? అన్న ప్ర‌శ్న‌కు.. అది త‌ప్పుడు విధానంలో ప్ర‌చారం సాగించార‌ని తెలిపారు. ఒక వార్తాపత్రిక సాజిద్ ఖాన్ డేటింగ్ చరిత్రలో నా పేరును తప్పుగా చేర్చింది. దానికి వారు నాకు క్షమాపణలు చెప్పారు! అని తెలిపింది. మీటూలో నేను ఎప్పుడూ సాజిద్ పై ఆరోపించ‌లేద‌ని కూడా ఈషా గుప్తా పేర్కొంది.