Begin typing your search above and press return to search.

మా నాన్న చనిపోలేదు.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

ఇకపోతే హీరో ధర్మేంద్ర చనిపోయారంటూ వస్తున్న వార్తలపై హేమమాలిని స్పందిస్తూ.." ప్రస్తుతం జరుగుతున్న విషయం క్షమించరానిది.

By:  Madhu Reddy   |   11 Nov 2025 10:27 AM IST
మా నాన్న చనిపోలేదు.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
X

బాలీవుడ్ యాక్షన్ కింగ్ గా.. హీమ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్రీ యాక్టర్ ధర్మేంద్ర.. గత రెండు రోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే చికిత్స తీసుకుంటూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచినట్లు వార్తలు రావడంతో సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా నెమరు వేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ధర్మేంద్ర మరణంపై కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.." మా నాన్న చనిపోలేదు" అంటూ సడన్ ట్విస్ట్ ఇచ్చింది ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్..

అసలు విషయంలోకి వెళ్తే.. ధర్మేంద్ర చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈషా డియోల్ స్పందిస్తూ.. మా నాన్న చనిపోయారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. మా నాన్న చనిపోలేదు. దయచేసి ఎవరూ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి" అంటూ ప్రకటించింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి చనిపోయాడు అంటూ వార్తలు రాగా ఇప్పుడు తన తండ్రి చనిపోలేదని ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది బ్రతికున్న వ్యక్తిని చంపేశారు కదరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే హీరో ధర్మేంద్ర చనిపోయారంటూ వస్తున్న వార్తలపై హేమమాలిని స్పందిస్తూ.." ప్రస్తుతం జరుగుతున్న విషయం క్షమించరానిది. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతంగా కొన్ని చానల్స్ తప్పుడు వార్తలను ఎలా వ్యాప్తి చేయగలవు? ఇది చాలా అగౌరవం.. బాధ్యత రహితంగా ఉంది.. దయచేసి మా కుటుంబానికి, గోప్యతకు తగిన గౌరవం ఇవ్వండి" అంటూ హేమమాలిని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది.

ఇకపోతే ధర్మేంద్ర హెల్త్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే.. ప్రముఖ నటుడు ధర్మేంద్ర నవంబర్ 10వ తేదీన ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. 89 సంవత్సరాల వయసులో మంగళవారం మరణించారని ఆయన బృందం ధ్రువీకరించింది. గతవారం ఆయనను సాధారణ వైద్య పరీక్షల కోసం అదే ఆసుపత్రిలో చేర్పించగా.. భార్య హేమమాలిని, కుమారుడు సన్నీ డియోల్ తో పాటూ ఇతర కుటుంబ సభ్యులు సందర్శించారు. అలాగే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి హాస్పిటల్ వెళ్లి మరీ ఆయనను కలిశారు. అయితే ఇంతలోనే ఇలాంటి రూమర్లు రావడంతో ఇప్పుడు ఆయన కూతురు అలాగే భార్య ఖండించారు.